Home Remedies: మూర్ఛ వ్యాధి నివారణకు, నిద్రలేమి నుంచి బయటపడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి
Home Remedies: ప్రస్తుతం మనం తినే ఆహారం. ఒత్తిడి.. శారీరక శ్రమ లేకవడం వంటి అనేక కారణాలతో చిన్న చిన్న వ్యాధుల బారిన పడడం సర్వసాధారణమయ్యింది..
Home Remedies: ప్రస్తుతం మనం తినే ఆహారం. ఒత్తిడి.. శారీరక శ్రమ లేకవడం వంటి అనేక కారణాలతో చిన్న చిన్న వ్యాధుల బారిన పడడం సర్వసాధారణమయ్యింది. అనారోగ్యానికి గురైన ప్రతిసారీ వైద్యుని దగ్గరకు వెళ్లడం ఆర్ధికంగానే కాదు శారీరకంగా అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. అయితే మన ఇల్లు, ఇంటి పరిసరాల్లో లభించే వాటితోటే కావాల్సిన వైద్యం చేసుకోవచ్చు. కనుక ఇంట్లోనే వైద్యం చేసుకునే ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటించండి.. వ్యాధులనుంచి విముక్తి పొందండి. ప్రతి సంవత్సరం భారీగా కొత్త మూర్ఛ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ మూర్ఛను సింపుల్ చిట్కాలతో నివారించుకోవచ్చు.
*మూర్ఛ రోగికి తులసి ఆకురసం సైందవ లవణంతో కలిపి 1 లేదా 2 చుక్కలు వేస్తే స్పృహ వస్తుంది. * పసుపు పొడి పొగ వేసినా మూర్చ నుండి మెలకువ వస్తుంది. * తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛవ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి. * కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడితే మూర్ఛ నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. * మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి 5 లేక 6 చుక్కల వావిలాకు రసం ముక్కులో వేస్తే ఫలితముంటుంది. * సీతాఫలం ఆకులు నలిపి వాసన చూపితే మూర్ఛ వ్యక్తికి మెలుకువ వస్తుంది. *ఉల్లి రసం ముక్కులో వేసినా మంచి ఫలితం ఉంటుంది.
మూర్ఛ రావడానికి ఒక కారణం నిద్రలేమి అని కూడా కారణం. కనుక నిద్రపట్టడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.
*శతావరి చూర్ణం, బెల్లంతో కలిపి తింటే చక్కని నిద్ర వస్తుంది. *కలమంద నూనె తలకు మర్దన చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. *మోది చూర్ణం, బెల్లంతో కలిపి తిన్నా సుఖనిద్ర వస్తుంది. *మరాటి మొగ్గ పొడి చేసి పాలలో కలిపి పడుకునే ముందు తాగాలి. * వేడి పాలు తాగినా సుఖనిద్ర వస్తుంది.
Also Read: సీనియర్ నటికి ఆర్ధికంగా అండగా నిలబడిన డ్యాన్స్ దీవానే టీమ్.. రూ.5 లక్షలు అందించిన మాధురీ దీక్షిత్