This Is Love: 20 ఏళ్ల క్రితమే మతాంతర వివాహం.. భర్తను కాపాడుకోవడానికి లివర్ ను డొనేట్ చేసిన భార్య .. ఇదీ ప్రేమంటే

This Is Love: ప్రేమ అంటే ప్రేమించడం.. మరచిపోవడం కాదు.. ప్రేమ అంటే.. ప్రేమించిన వ్యక్తి మరణించే వరకూ తోడు నీడగా కష్ట సుఖాల్లో తోడునీడగా జీవించడం...

This Is Love: 20 ఏళ్ల క్రితమే మతాంతర వివాహం.. భర్తను కాపాడుకోవడానికి లివర్ ను డొనేట్ చేసిన భార్య .. ఇదీ ప్రేమంటే
Woman Donates Liver
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 10, 2021 | 6:20 PM

This Is Love: ప్రేమ అంటే ప్రేమించడం.. మరచిపోవడం కాదు.. ప్రేమ అంటే.. ప్రేమించిన వ్యక్తి మరణించే వరకూ తోడు నీడగా కష్ట సుఖాల్లో తోడునీడగా జీవించడం. ఈ మాటకు అర్ధం చెప్పింది ఓ జంట.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటె శరీరంలోని తన అవయవాన్ని దానం చేసింది. ప్రేమను పంచిన భర్తకు మళ్ళీ జీవం పోసింది. ఈ సంఘటనకు వేదికగా హైద‌రాబాద్ లోని లక్డీకాపూల్ లో ఉన్న గ్లెనిగల్స్‌ గ్లోబల్ హాస్పిట‌ల్‌ నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ లోని క‌డప జిల్లా పొద్దుటూరుకు చెందిన వెంటకసుబ్బారెడ్డి , ముంతాజ్ లు 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో.. ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఒకసారి గుండె పోటు వచ్చింది అప్పుడు స్టంట్లు వేసి అతనికి జీవితాన్ని ఇచ్చారు వైద్యులు.. అయితే లాస్ట్ ఇయర్ మళ్లీ సుబ్బారెడ్డి పచ్చకామెర్ల బారిన పడ్డారు.. సీరియస్ అవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే సుబ్బారెడ్డిని పరీక్షించిన వైద్యులు అతనికి లివర్ పూర్తిగా దెబ్బతిందని.. ప్రాణాలు దక్కాలంటే తప్పనిసరిగా కాలేయం మార్పిడి చేయాలని చెప్పారు. లివర్ మార్పిడి ఖర్చుతో కూడుకున్నది కనుక సీఎం రీఎఫ్ ఫండ్ కు అప్లై చేశారు. ప్రభుత్వం రూ.10 ల‌క్ష‌ల‌ను రిలీజ్ చేసింది. దీంతో హైదరాబాద్ లోని ఆసపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. ఈ ఏడాది మార్చిలో ఆప‌రేష‌న్ చేశారు. భర్తకు ముంతాజ్ త‌న లివ‌ర్ ఇచ్చింది. అందుకు రూ.20 ల‌క్ష‌లు అయ్యింది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఇప్పడూ సుబ్బారెడ్డి , ముంతాజ్ లు కోలుకుంటున్నారు.

Also Read: సీనియర్ నటికి ఆర్ధికంగా అండగా నిలబడిన డ్యాన్స్ దీవానే టీమ్.. రూ.5 లక్షలు అందించిన మాధురీ దీక్షిత్

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి