Katti Mahesh Death: కత్తి మహేష్ మృతిపై తమ సంతాపాన్ని వెలిబుచ్చుతోన్న ఏపీ పొలిటికల్ పార్టీలు

అతడో పోరాటాల కత్తి. వివాదాస్పద వ్యక్తి. అది సినిమా అయినా- రాజకీయాలైనా.. చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలైనా.. కుండ బద్దలు కొట్టడంలో ముందుంటాడు. కోర్టుల వరకూ వెళ్తాడు...

Katti Mahesh Death: కత్తి మహేష్ మృతిపై తమ సంతాపాన్ని వెలిబుచ్చుతోన్న ఏపీ పొలిటికల్ పార్టీలు
Katti Mahesh Death Reaction
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 10, 2021 | 11:13 PM

Katti Mahesh Death: అతడో పోరాటాల కత్తి. వివాదాస్పద వ్యక్తి. అది సినిమా అయినా- రాజకీయాలైనా.. చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలైనా.. కుండ బద్దలు కొట్టడంలో ముందుంటాడు. కోర్టుల వరకూ వెళ్తాడు. నగర బహిష్కరణకూ గురవుతాడు. అతడే.. నటుడు- వ్యాఖ్యాత- దర్శకుడు సినీ రాజకీయ విమర్శకుడు కత్తి మహేష్. అలాంటి కత్తి మహేష్ ఇక లేడు. ఇటీవల నెల్లూరు జిల్లాలో కారు ప్రమాదానికి గురైన కత్తి మహేష్.. మొదట నెల్లూరు ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత చెన్నై అపోలోకి మార్చారు. ఎడమ కన్ను ఛిద్రమైందని అన్నారు.

మెదడులో రక్త స్రావం లేదు కాబట్టి బతికే అవకాశాలే ఎక్కువన్నారు డాక్టర్లు. జగన్ గవర్నమెంట్ కత్తి మహేష్ చికిత్సకై 17 లక్షల రూపాయలు విడుదల చేసింది. బతుకుతాడనే భావించారంతా. కానీ ఏ విధి వక్రించిందో తెలీదు. ఏ దురదృష్టం వెంటాడిందో అంతు చిక్కదు. కత్తి మహేష్ చికిత్స పొందుతూ నేడు మరణించాడు.

ఇక, కత్తి మహేష్ మృతి పట్ల అతని స్నేహితులు, అభిమానులు తమ ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నారు.

Read also: వకీల్ సాబ్ అడిగిన లాజిక్: ఇవాళ జంటనగరాల పోలీసుల సాయంతో వర్కౌటైంది..! నిండు ప్రాణం నిలబడింది