వకీల్ సాబ్ అడిగిన లాజిక్: ఇవాళ జంటనగరాల పోలీసుల సాయంతో వర్కౌటైంది..! నిండు ప్రాణం నిలబడింది

వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ అంటూ పవన్ కళ్యాణ్‌ ఓ మహిళా పోలీస్ ను కామెంట్ చేస్తాడు.. గుర్తుందా? 40 కిలోమీటర్ల దూరాన్ని మీరు 15 నిమిషాల్లో ఎలా చేరుకున్నారమ్మా? అని అడుగటం....

వకీల్ సాబ్ అడిగిన లాజిక్: ఇవాళ జంటనగరాల పోలీసుల సాయంతో వర్కౌటైంది..! నిండు ప్రాణం నిలబడింది
Live Organ Transport
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 10, 2021 | 8:42 PM

రంజిత్, టీవీ9 ప్రతినిధి

Transport live organ: వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ అంటూ పవన్ కళ్యాణ్‌ ఓ మహిళా పోలీస్ ను కామెంట్ చేస్తాడు.. గుర్తుందా? 40 కిలోమీటర్ల దూరాన్ని మీరు 15 నిమిషాల్లో ఎలా చేరుకున్నారమ్మా? అని అడుగటం.. ఈ సినిమా చూసిన వారికి తెలిసే ఉంటుంది. సరిగ్గా అలాగే హైదరాబాద్ లో ఓ జెట్ స్పీడ్ ఘటన నేడు జరిగింది.

ఓ మనిషికి ప్రాణం పోసేది దేవుడు. కానీ ఆ మనిషికి ఆరోప్రాణమిచ్చేది డాక్టరే. ఇది అందరికి తెలిసిన మేటరే. కానీ.. ఆ మనిషికి డాక్లరే కాదు ప్రాణం నిలబడాలంటే పోలీసుల సహాయం అవసరమైంది. పోలీసులు కూడా సహకరించారు. సీన్‌ కట్‌ చేస్తే.. ఆ మనిషి గుండె కొట్టుకుంటుంది. అసలు ఆ గుండె కొట్టుకోవడానికి పోలీసులకు మధ్య లింకేంటి..? గుండె గుడిలో నిలిచిన కాప్స్‌ కహానీ ఏంటో చూద్దాం..?

ఒకరి గుండె చప్పుడు ఆగిపోకుండా కాపాడాలంటే వాయువేగంతో చికిత్స అవసరం. 36 కిలోమీటర్లు 30 నిమిషాలలో చేరాలి. మరి హైదరాబాద్‌లో ఎలా సాధ్యమవుతుంది. కచ్చితంగా సాధ్యపడుతుందా అనుకునే వేళ పోలీసుల ఎంట్రీతో అసాధ్యం కాస్తా.. సుసాధ్యమైంది. రెండు పోలీస్ కమిషనరేట్ల సమన్వయంతో సక్సెస్‌ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్‌లో ఉన్న కిమ్స్‌ హాస్పిటల్‌లో ఒకరికి హార్ట్‌, లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంటెషన్‌ చేయాల్సి ఉంది. గ్రీన్‌ఛానల్‌ ద్వారా మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది గుండె. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ.. శంషాబాద్‌ నుండి సికింద్రాబాద్‌ వెళ్లాలంటే ట్రాఫిక్‌ను దాటుకొని వెళ్లాలి. మినిమం గంటన్నర అయినా పడుతుంది. అదే గనుక ఆలస్యమైతే.. ఓ మనిషిని బతికించాలని మరో ప్రాణం చేసిన త్యాగం వృథా అవుతుంది.

ఈ మేటర్‌ కాస్తా రెండు కమిషనరేట్లలో ఉన్న పోలీసు బాస్‌లకు తెలిసొచ్చింది. వెంటనే ఒక్క క్షణం కూడా అంబులెన్స్‌ ఆగడానికి వీళ్లేదు అని.. ఎక్కడి బండ్లు అక్కడే ఆపారు. ప్రతి సెకండ్‌ కౌంట్‌, ప్రతి నిమిషం రివ్యూ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సిటీ మొత్తం అలర్ట్‌. ఇలా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్‌ కిమ్స్‌ హాస్పిటల్‌, శంషాబాద్‌ నుండి కేవలం 26 నిమిషాల్లో వెళ్లి గుండెచప్పుడు ఆగకుండా చేశారు. ఓ ప్రాణాన్ని కాపాడారు.

ఒకరి గుండె చప్పుడు ఆగిపోకుండా చేసిన ప్రతొక్కరికి వారి తరపునే కాదు సమాజం నుండి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Organ Transport

Organ TransportRead also: Zika virus: ఇక, ‘జికా’ వైరస్ వంతు..! కేరళలో కొత్తగా బయల్పడ్డ మహమ్మారితో కేంద్రం అప్రమత్తం.. అధ్యయనానికి ప్రత్యేక బృందం