Amazon: అమెజాన్‌లో ఫోన్‌ ఆర్డర్‌ చేశాడు.. వచ్చిన పార్సిల్‌ చూసి షాక్‌ అయ్యాడు. అనంతరం బాధితుడు ఏం చేశాడో తెలుసా.?

Amazon: ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింప్‌ వ్యాపారం మూడు ఫోన్‌లు, నాలుగు టీవీలు అన్నట్లుగా సాగుతోంది. చిన్న చిన్న మొబైల్‌ ఫోన్‌ల నుంచి మొదలు పెద్ద పెద్ద టీవీలు, వాషింగ్‌ మిషిన్ల వరకు అన్ని రకాల వస్తువులు ఆన్‌లైన్‌లో కొనేస్తున్నారు. సదరు...

Amazon: అమెజాన్‌లో ఫోన్‌ ఆర్డర్‌ చేశాడు.. వచ్చిన పార్సిల్‌ చూసి షాక్‌ అయ్యాడు. అనంతరం బాధితుడు ఏం చేశాడో తెలుసా.?
Amazon Wrong Delivery
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 10, 2021 | 7:21 PM

Amazon: ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింప్‌ వ్యాపారం మూడు ఫోన్‌లు, నాలుగు టీవీలు అన్నట్లుగా సాగుతోంది. చిన్న చిన్న మొబైల్‌ ఫోన్‌ల నుంచి మొదలు పెద్ద పెద్ద టీవీలు, వాషింగ్‌ మిషిన్ల వరకు అన్ని రకాల వస్తువులు ఆన్‌లైన్‌లో కొనేస్తున్నారు. సదరు ఆన్‌లైన్‌ సంస్థలు సైతం వినియోగదారుల నమ్మకాన్ని చొరగొంటూ వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం పొరపాటులు జరుగుతూనే ఉన్నాయి. ఫోన్‌ బుక్‌ చేస్తే రాళ్లు రావడంలాంటి ఘటనలను మనం అడపాదడపా చూస్తునే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

Amazon

వివరాల్లోకి వెళితే.. నగరంలోని బీకే గూడ పార్కుకు చెందిన విజయ్‌ కుమార్‌ అనే ఓ వ్యక్తి 2020 డిసెంబర్ 19న అమెజాన్‌ ద్వారా ఒప్పో మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఆన్‌లైన్‌ రూ. 11,990 చెల్లించి ఫోన్‌ను ఆర్డర్‌ చేశాడు. అయితే ఇంటికి వచ్చిన పార్సిల్‌ ఓపెన్ చేసి చూడగానే విజయ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఒప్పో ఫోన్‌ ఉండాల్సిన చోట సబ్బు, సర్ఫ్‌ ప్యాకెట్‌ ఉండడంతో ఖంగుతిన్నాడు. దీంతో వెంటనే అలర్ట్‌ అయ్యి అమేజాన్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం అందించాడు. అయితే అమేజాన్‌ నుంచి ఎంతకీ స్పందన రాకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీంతో బాధితుడు వెర్షన్‌ విన్న వినియోగదారుల ఫోరం.. అమెజాన్‌ ఇండియా మేనేజర్, అప్పారియో రిటైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మేనేజర్‌కు ఫోరం నోటీసులు జారీ చేసింది. అమెజాన్‌ తరఫున హాజరైన న్యాయవాదులు సరైన సాక్ష్యాలు చూపించకపోవడంతో విజయ్‌ కుమార్‌ ఫోన్‌ కోసం చెల్లించిన మొత్తానికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఫిర్యాదు దారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5వేలు ఫిర్యాదుదారుడికి చెల్లించాలని ఫోరం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Lakshmi Manchu: మరో సరికొత్త ప్రోగ్రామ్ తో రానున్న ఆహా .. మంచు లక్ష్మి హోస్ట్ గా ‘ఆహా భోజనంబు’

Snapdragon Insider: మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంత ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

Harbhajan Singh: రెండోసారి తండ్రైన హర్భజన్ సింగ్.. మా కుటుంబం పరిపూర్ణమైంది అంటూ ట్వీట్