తెలంగాణలో షర్మిల పార్టీకి నిర్మాత ఈయన, స్క్రిప్ట్, డైరెక్టర్ ఆయన..! నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రామాలు ఆపేస్తే కృష్ణా జలాల సమస్య తీరిపోయినట్లే అని నారాయణ ఘాటు కామెంట్లు చేశారు...

తెలంగాణలో షర్మిల పార్టీకి  నిర్మాత ఈయన, స్క్రిప్ట్, డైరెక్టర్ ఆయన..! నారాయణ సంచలన వ్యాఖ్యలు
CPI Narayana

CPI Narayana: తెలంగాణలో షర్మిల పార్టీకి నిర్మాత జగన్.. స్క్రిప్ట్, డైరెక్టర్ కేసీఆర్ అంటూ విమర్శించారు CPI జాతీయ కార్యదర్శి నారాయణ. వీరిరువురి అనుమతి లేకపోతే షర్మిల తెలంగాణలో తిరుగుతుందా..? అని ఆయన ప్రశ్నించారు.TRS వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే షర్మిల పార్టీ పెట్టిందన్నారు. ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రామాలు ఆపేస్తే కృష్ణా జలాల సమస్య తీరిపోయినట్లే అని నారాయణ ఘాటు కామెంట్లు చేశారు.

అమిత్ షా అండదండలు ఉన్నంత కాలం జగన్ కు బెయిల్ రద్దు కాదని నారాయణ అన్నారు. కొవిడ్ నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలం అయిందని చెప్పిన నారాయణ.. కరోనా కారణంగా చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఇవ్వలేని కేంద్రం.. కార్పొరేట్ లకు లక్షా ఆరవై కోట్ల రూపాయలు ఇచ్చిందని మండిపడ్డారు. వాజ్ పేయి మంచి రాజకీయ నేత అయితే, మోడీ ఫ్యాక్షనిస్ట్ నేత అని నారాయణ అన్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం సీపీఐ చేస్తున్నట్లు నారాయణ చెప్పారు. ఫాదర్ స్టాన్ సాన్ ది సర్కారు హత్యే అని చెప్పిన నారాయణ, ఇదే దారిలో వరవరావు, సాయిబాబాను చంపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో RBI, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ లను డమ్మీ చేశారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Zika virus: ఇక, ‘జికా’ వైరస్ వంతు..! కేరళలో కొత్తగా బయల్పడ్డ మహమ్మారితో కేంద్రం అప్రమత్తం.. అధ్యయనానికి ప్రత్యేక బృందం

Click on your DTH Provider to Add TV9 Telugu