Karthika Deepam: లాయర్ ని కలిసిన దీప.. ఆరోజు ఏం జరిగిందో నిజం చెప్పమని ప్రియమణిని కోరుతున్న కార్తీక్
Karthika Deepam: కార్తీక దీపం ఈరోజు 1088 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత మోసాన్ని కనిపెట్టే పనిలో కార్తీక్ ఉన్నాడు. భాగ్యం మోనిత కు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుంది.. కార్తీక్ ప్రియమణిని కలుస్తాడు..
Karthika Deepam: కార్తీక దీపం ఈరోజు 1088 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత మోసాన్ని కనిపెట్టే పనిలో కార్తీక్ ఉన్నాడు. భాగ్యం మోనిత కు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుంది.. కార్తీక్ ప్రియమణిని కలుస్తాడు.. చెప్పు ప్రియమణి ఆ రోజు ఏమి జరిగిందో.. పరాయి స్త్రీల మీద చెయ్యి వెయ్యడం చెయ్యి చేసుకోవడం తప్పు అని నాకు తెలుసు.. మా అమ్మ నన్ను అలా పెంచలేదు. ఆ రాత్రి ఏమి జరిగిందని.. ఆ రాత్రిని అడగలేను.. అందుకే నిన్ను అడుగుతున్నా. మోనిత నీకు జీతం ఇచ్చే యజమాని అని తెలుసు.. కానీ ఇది నా జీవితం. ఎన్నో ఏళ్ల తర్వాత నా జీవితంలో కలతలు దూరమయ్యాయని సంతోషపడే లోపే మోనిత ఈ వార్త తీసుకొచ్చింది. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు.. నాకు మోనిత ఒక ఫ్రెండ్ అని తెలుసు.ఇది నిజం కాదని నీకు తెలుసు. అబద్దం అని నాకు తెలుసు.. అంటుంటే.. ప్రియమణికి ఆరోజు రాత్రి మోనిత హాల్ లో నిద్రపోయిన విషయం గుర్తుకోటుంది. నిజం చెబితే మోనిత తనను చంపేస్తుందని భయపడి.. నాకు ఏమీ తెలియదు.. పెద్దవారి గొడవలోకి నన్ను లాగకండి అంటూ.. అక్కడనుంచి వెళ్ళిపోతుంది.
దీప, ఆదిత్య ఒక ఇంటినుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతారు. అది మోనిత చూస్తుంది. దీప ఆదిత్యతో ఈ విషయం మీ అన్నయ్యకు తెలియనీయకు.. ఎందుకు వదినా అంటే.. మీ అన్నయ్యకు నేను సపోర్ట్ చేస్తున్నానని తెలిస్తే.. మీ అన్నయ్య ఏ టైలో నైనా నోరు జారతాడు. అది రెచ్చి పోతుంది. వేగం పెంచుతుంది. అపుడు సమస్య ఇంకా పెద్దది అవుతుంది అంటే.. సరే అంటాడు ఆదిత్య. మోనిత ను చూడని.. వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెంటనే మోనిత కారు దిగి దీప వచ్చిన ఇంట్లోకి వెళ్తుంది. అది జి. రవిశంకర్ లాయర్ అనే నెమ్ బోర్డు చూసి… షాక్ తింటుంది. అంటే దీప కార్తీక్ కోసం పోరాటం మొదలు పెట్టిందా.. నాకు న్యాయం జరగకూడదు అని లాయర్ ని అడగడానికి వచ్చిందాఅంటూ.. కార్తీక్ తనతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుని వణికిపోతోంది.
భాగ్యం కార్తీక్ దీపల ఫోటోని తుడుస్తూ ఉంటుంది.. అదే సమయంలో కార్తీక్ భాగ్యం ఇంటికి వెళ్తాడు. గతంలో కార్తీక్ పగలగొట్టిన సంగతి గుర్తు చేసుకుని తీసేయమంటే తీసేస్తా బాబు అంటుంది..భాగ్యం భయపడుతూ.. కార్తీక్ నన్ను ఇంకా పరీక్షిస్తున్నారా భాగ్యంగారు.. ఆ ఫోటో ఇప్పుడు కూడా నేను పగలగొడితే.. దీప ఇంకా ఎత్తుకు ఎదిగిపోతుంది. మా మధ్య దూరం వద్దు.. నన్ను చూసి భయపడుతున్నారు. ఇంటికి వచ్చిన మనిషి పై గౌరవడంఉండాలి.,. ఉండాలి..అది నేను ఎప్పుడో పోగొట్టుకున్నా అంటాడు కార్తీక్. మీరు అంటే గౌరవం ఎప్పుడు మాకుంది. భాగ్యానికి కార్తీక్ దణ్ణం పెడితే.. అక్షరం ముక్కలేని నాకు మీరు నాకు దణ్ణం పెట్టడం ఏమిటయ్యా..అంటుంది
అందరూ నన్ను అనుమిస్తున్నారు. మీరు నా తరపున మాట్లాడానికి మోనిత దగ్గరకు వెళ్లారని తెలిసింది. నాకు ఇప్పుడు మీలో అమ్మ కనిపిస్తుంది. మీ నమ్మకం నిజం.. ఇది దీపని నేను అనుమానించినందుకు నన్ను అంటుకున్న శాపం. భార్య బార్టల్లో ఒకరి మీద ఒకరి వుండాల్సింది నమ్మకం.. ఒకరిని అనుమానిస్తే… ఎలా ఉంటుందో తెలియడానికి ఆ దేవుడు నాకు తెలిసేలా చేసాడు . అందుకే నేను గతంలో చేసిన దానికి క్షమాపణ చెబుతున్నా అంటాడు కార్తీక్. మా దీప ఎంత పవిత్రమైనదో.. మీ మనసు కూడా అంతే పవిత్రమైంది. ఆ మోనిత ఎలాంటిదో నాకు తెలుసు.. దానికి బుద్ధి చెప్పడానికి నేను ఏమి చెయ్యాలో అది చేస్తా మీ కాపురంలో ఏ పీడా రాకుండా చేయాలనేది నా ప్రయత్నం బాబు అంటుంది.. మీరు ప్రశాంతంగా ఉండండి.. మీ కాపురం చక్కబడుతుంది అంటుంది. మనుషులు ఎలా బతకాలో నాకు దీప నేర్పింది బాబు ఇప్పుడు మీరు .. మీరిద్దరూ చల్లగా ఉండలని అని కోరుకుంటుంది భాగ్యం
పిల్లలు ఇంట్లో ఫ్యాషన్ షో చేస్తుంటే.. దీప అది సంతోషంగా చూస్తుంది. అదే సమయంలో కార్తీక్ వస్తాడు.. దీపని చూసి పిలల్లు సిగ్గుపడి చేతులతో కళ్ళు మూసుకుంటారు. ఎప్పటికి మీరు ఇలాగె నవ్వుతుండాలి.. అంటే నువ్వు అంటాడు.. అలాగే అంటే డాడీ కూడా అంటే కూడా అంటుంది దీప అది చూసి పెద్ద నవ్వుతుంటే.. కార్తీక్ తన భార్యా బిడ్డల సంతోషాన్ని చూసి కార్తీక్ మురిసిపోతాడు కార్తీక్ గోడ మీద గీతలు లేకపోవడం చూస్తాడు.. మోనిత మాటలను గుర్తు చేసుకుంటూ.. దీప దగ్గరకు వస్తాడు. ఇంతలో హిమ అమ్మా నా డ్రెస్ కనిపించడం లేదు అంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మోనిత కు దీప ఊహించని షాక్ ఇస్తుంది.
Also Read: Kora Srinivasa Rao: భయపెట్టడమూ.. నవ్వించడం రెండు ఆయనకే సాధ్యం.. వెండితెరపై చెరగని ముద్ర..