Kathi Mahesh: కత్తి మహేష్ సహకారం అందించిన మిణుగురులు స్క్రిప్ట్ కు ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్..

Kathi Mahesh : కత్తి మహేష్ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, సినీ విమర్శకుడు, బ్లాగర్, రాజకీయ నాయకుడు. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి..

Kathi Mahesh: కత్తి మహేష్ సహకారం అందించిన మిణుగురులు స్క్రిప్ట్ కు ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్..
Katti Mahesh
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 10, 2021 | 8:19 PM

Kathi Mahesh : కత్తి మహేష్ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, సినీ విమర్శకుడు, బ్లాగర్, రాజకీయ నాయకుడు. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి.. ఈరోజు మరణించారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఓ నిరుపేద కుటుంబం లో 1977 లో కత్తి మహేష్ జన్మించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి ఫిలిం థియరీతో డిగ్రీ పూర్తి చేశారు. అయితే కత్తి మహేష్ కుటుంబంలోని అందరూ విద్యావంతులు కావడంతో అయన కూడా చదువులో మంచి ప్రతిభను కనబరిచేవారు. సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు అంతర్జాతీయ ఎం జీవో గా పనిచేశారు. అనేక రాష్ట్రాల్లో పేదరిక నిర్ములన, గ్రామీణాభివృద్ధి వంటి అనేక అంశాలతో క్షేత్ర స్థాయిలో పనిచేశారు.. అలా పనిచేస్తున్న సమయంలోనే ఓ యువతితో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు.

మొదటి నుంచి ఫిల్మ్ లవర్ అయిన కత్తి మహేష్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక భాషల సినిమాలపై రివ్యూలు రాస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు . సమీక్షకుడుగా వచ్చిన గుర్తింపుతో టాలీవుడ్ లో అడుగు పెట్టి.. అనేక సినిమాలకు సహకార రచయితగా పనిచేశాసాడు. సహా రచయితగా పనిచేసిన మిణుగురులు సినిమా జాతీయ అవార్డు కూడా లభించింది. అంతేకాదు స్క్రిప్ట్ పరంగా ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్ సంపాదించుకుంది. పెసరట్టు (సినిమా) అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. ఈ సినిమా తో 27మంది నూతన నటీనటులను వెండి తెరకు పరిచయం చేశాసాడు. హృదయం కాలేయం సినిమాతో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తో బుల్లి తెరపై అలరించాడు కత్తి మహేష్. కొబ్బరి మట్ట , నేనే రాజు నేనే మంత్రి, రవితేజ సూపర్ హిట్ మూవీ క్రాక్ లో వంటి సినిమాల్లో నటించి అలరించాడు. కత్తి మహేష్ కు విమర్శకులు ఎంతమంది ఉన్నారో.. ఆయనను అభిమానించేవారు కూడా అంతే మంది ఉన్నారు.

Also Read:  కత్తి మహేష్ మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను : మంచు మనోజ్