Gaana of Republic: ఆకట్టుకుంటున్న గానా ఆఫ్ రిపబ్లిక్ .. మరోసారి మెస్మరైజ్ చేసిన మణిశర్మ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల కథలవిషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతం అయిన తేజ్ చిత్రలహరి సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు.
Republic: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల కథలవిషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతం అయిన తేజ్ చిత్రలహరి సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ మెగా హీరో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రిపబ్లిక్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తుంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ లు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
గేయ రచయిత రెహమాన్ అందమైన లిరిక్స్ రాశారు. ఈ యూత్ ఫుల్ సాంగ్ ని యువ గాయకులు అనురాగ్ కులకర్ణి – ధనుంజయ్ – హైమత్ మహ్మద్ – ఆదిత్య అయ్యంగర్ – పృథ్వీ చంద్ర కలసి ఆలపించారు. హేయ్ రారో.. హేయ్ రారో.. నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం.. నా మౌనం పాడే గానం.. నా ప్రశ్న సమాధానం’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :