Vizianagaram: ఏపీ విజయనగరంలో జై భీమ్ తరహా ఘటన.. లాక్‌అప్ డెత్‌పై విచారణకు ఆదేశం..
Lockup Death in Vizianagaram: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో జై భీం (Lockup Death) సినిమా ఘటన చోటుచేసుకుంది. లాకప్‌లో ఉన్న ఓ నేరస్థుడు చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Lockup Death in Vizianagaram: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో జై భీం (Lockup Death) సినిమా ఘటన చోటుచేసుకుంది. లాకప్‌లో ఉన్న ఓ నేరస్థుడు చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకనే చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తుండగా.. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటన జిల్లాలోని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. వివరాలు.. ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బ్యాటరీల దొంగతనం కేసులో (Vizianagaram) శాంతినగర్‌కు చెందిన సురేష్ అలియాస్ బేతా రాంబాబు (42) ను నెల్లిమర్ల పోలీసులు.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాంబాబు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు (Nellimarla Police Station) పోలీసులు పేర్కొంటున్నారు.
అయితే.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దెబ్బలు తాళలేకే రాంబాబు మృతిచెందాడని బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం కాస్త జిల్లాలో కలకలం రేపడంతో విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. కస్టోడియల్ డెత్‌పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ భవానీశంకర్‌ను ఆదేశించారు.
విజయనగరం ఆర్డీఓ భవాని శంకర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహన్ని పరిశీలించారు. మృతిడి బంధువులు, పోలీసు స్టేషన్‌లో విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా.. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పాత నేరస్థుడు రాంబాబును కొట్టడంతోనే చనిపోయాడని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: