Twitter: ట్విట్టర్ సేవల్లో అంతరాయం.. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఫిర్యాదులు.. అసలేమైందంటే..?
Twitter Down: సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసేపు ట్విట్టర్ (Twitter) సేవలు నిలిచిపోయినట్లు సోషల్ మీడియా యూజర్లు
Twitter Down: సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసేపు ట్విట్టర్ (Twitter) సేవలు నిలిచిపోయినట్లు సోషల్ మీడియా యూజర్లు పేర్కొన్నారు. భారత్ సహా.. అమెరికా తదితర దేశాల్లో ట్విట్టర్ సేవల్లో అంతరాయం కలిగినట్లు యూజర్లు వెల్లడించారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ (Down Detector) ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా పలువురు యూజర్లు శుక్రవారం రాత్రి 10.30 గంటల తర్వాత ట్విటర్ సర్వర్‌లో సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో గంటపాటు ట్విటర్ సేవలకు అంతరాయం కలిగినట్లు పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. మొబైల్స్‌తో పాటు వెబ్‌సైట్‌లో కూడా ట్విటర్‌ను వినియోగించలేకపోయామని యూజర్లు రిపోర్ట్ చేశారు. లోడింగ్ సమస్యతో పాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కాలేదంటూ రిపోర్ట్‌లో వెల్లడించారు. డౌన్‌డెటెక్టర్ దాదాపు 15 వేల మంది యూజర్‌ల అంతరాయాల నివేదికలను చూపించింది.
ట్విట్టర్ సేవల్లో అంతరాయంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ స్పందించింది. సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల అధిక సంఖ్యలో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) ఎర్రర్‌లను ట్విట్టర్ ఎదుర్కొంటోందని.. ప్రస్తుతం సమస్యను పరిష్కరించామని ప్రకటనను విడుదల చేసింది. ఇంకా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
#UPDATE | Technical bug preventing timelines from loading and Tweets from posting has been fixed: Twitter pic.twitter.com/9t3GUBaIB5
— ANI (@ANI) February 11, 2022
డౌన్‌డెటెక్టర్.. అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యూజర్ సమర్పించిన ఎర్రర్‌లతో సహా అనేక రిపోర్టులను క్రోడీకరించడం ద్వారా అంతరాయాలను ట్రాక్ చేస్తుంది.
Also Read: