Hyderabad: బరువు తగ్గిస్తామంటూ బురిడీ.. అమాయకులను దోచుకుంటున్న వెయిట్ లాస్ క్లినిక్‌లు.. షాకింగ్ విషయాలు..
Weight Loss Clinic Cheating: ఆధునిక ప్రపంచంలో చాలామంది ఊబకాయం (అధిక బరువు) సమస్యతో సతమతమవుతున్నారు. వారి సమస్యను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న హైదరాబాద్ నగరంలోని
Weight Loss Clinic Cheating: ఆధునిక ప్రపంచంలో చాలామంది ఊబకాయం (అధిక బరువు) సమస్యతో సతమతమవుతున్నారు. వారి సమస్యను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న హైదరాబాద్ నగరంలోని వెయిట్ లాస్ క్లినిక్ (Weight Loss Clinic) లు మోసాలకు పాల్పడుతున్నాయి. ఏలాంటి కెమికల్స్, మెడిసిన్స్ అవసరం లేదు. కేవలం నాచురల్ పద్ధతిలోనే బరువు తగ్గిస్తామంటూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో వెయిట్ లాస్ క్లీనిక్‌లలో జరిగిన మోసాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి వారికైనా కేవలం మూడు నెలల నుండి ఆరు నెలల్లో ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు బరువు తగ్గిస్తామని హామీ ఇస్తూ జనాలని మోసం చేస్తున్నారు క్లీనిక్ నిర్వాహకులు. సహజ పద్ధతిలో వెయిట్ లాస్ చికిత్స అందిస్తామని చెప్పగా ఉప్పల్ మేడిపల్లిలోని కలర్స్ (Kolors) సంస్థను ఆశ్రయించింది ఓ మహిళ.
రెండు ఇన్స్టాల్మెంట్ లో గత ఏడాది ఏప్రిల్లో 35 వేలు కట్టారు. మూడు సిట్టింగ్ లో చికిత్స అందించిన ఉన్న బరువు కంటే మరో రెండు కేజీలు అదనంగా పెరిగింది. మరో రెండు కేజీలు అదనంగా పెరగడమేంటని ప్రశ్నించింది బాధితురాలు తల్లి. అంతేకాకుండా ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ తో గుండె పోటు వచ్చిందని చెబుతుంది. చికిత్స ఆపేసి చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా.. ఎలాంటి వివరణ ఇవ్వక పోడంలో జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు బాధితులు.
కాగా.. వెయిట్ లాస్ క్లినిక్‌ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు డాక్టర్లు. ఈ ట్రీట్మెంట్ వాడేందుకు ఎలాంటి పర్మిషన్ లేదంటున్నారు డాక్లర్లు. ఒకప్పుడు అత్యధిక ఖర్చుతో కూడుకోవడంతో బాగా డబ్బున్నవారు మాత్రమే ఈ వెయిట్ లాస్ చేయించుకునేవారు. ఇప్పుడు సామన్య ప్రజలు సైతం అందుబాటులోకి బాడీ వెయిట్ లాసింగ్ అని ప్రచార ఆర్భాటాలు.. ఫీజుల్లో రాయితీలతో అమాయక ప్రజలను ఉసిగొల్పుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని వెయిట్ లాస్ క్లినిక్ లు దాదాపు అన్నీ ఇలాంటి మోసాలకు తెరతీస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు బాధితులు.
Also Read: