Hooch Tragedy: మళ్లీ కాటేస్తున్న కల్తీ మద్యం.. గంటల వ్యవధిలోనే ఆరుగురు బలి..

Bihar Hooch Tragedy: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌ (Bihar) లో కల్తీ మద్యం కాటేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో..

Hooch Tragedy: మళ్లీ కాటేస్తున్న కల్తీ మద్యం.. గంటల వ్యవధిలోనే ఆరుగురు బలి..
Hooch Tragedy
Follow us

|

Updated on: Jan 27, 2022 | 5:05 PM

Bihar Hooch Tragedy: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌ (Bihar) లో కల్తీ మద్యం కాటేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో.. కల్తీ మద్యం (Hooch Tragedy) తాగి ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ గ్రామంలో చోటుచేసుకుంది. ఆరుగురి మృతిపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. మద్యం తాగి (Spurious Liquor) ఆరుగురు కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నామని.. దాని తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. అయితే.. బాధితులు కల్తీ మద్యం తాగి మరణించినట్లు మృతుల బంధువులు పేర్కొంటున్నారు. బుధవారం వీరంతా కల్తీ మద్యం తాగిన తర్వాత అనారోగ్యం బారిన పడ్డారని, ఆసుపత్రుల్లో చేరి మరణించినట్లు పేర్కొంటున్నారు.

కాగా.. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో కలకలం రేపింది. సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించిన ఘటన జరిగిన వారంలోపే మరో విషాదం జరిగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలన్నీ జేడీయూ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించారు.

ఇదిలాఉంటే.. ఇటీవల నలంద జిల్లాలో సైతం కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. 2021లో అక్టోబరు-నవంబర్ మద్య బీహార్‌లోని పలు జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా మరణించినట్లు పలు గణాంకాలు పేర్కొంటున్నాయి.

Also Read:

Hyderabad: చెత్త కింద చారిత్రక నిర్మాణం.. హైదరాబాద్‌లో బయటపడిన పురాతన కట్టడం..!

TATA – Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..