Hyderabad: చెత్త కింద చారిత్రక నిర్మాణం.. హైదరాబాద్‌లో బయటపడిన పురాతన కట్టడం..!

Heritage Places in Hyderabad: అది నిత్యం రద్దీగా ఉండే కాలనీ.. అక్కడే భవనాల మధ్య కంపు కొట్టే చెత్తతో పెద్ద స్థలం నిండి ఉంది.

Hyderabad: చెత్త కింద చారిత్రక నిర్మాణం.. హైదరాబాద్‌లో బయటపడిన పురాతన కట్టడం..!
Follow us

|

Updated on: Jan 27, 2022 | 5:03 PM

Heritage Places in Hyderabad: అది నిత్యం రద్దీగా ఉండే కాలనీ.. అక్కడే భవనాల మధ్య కంపు కొట్టే చెత్తతో పెద్ద స్థలం నిండి ఉంది. ఏదో పాత కట్టడంలే అనుకునేవారు అంతా. కానీ ఆ చెత్త కింద ఏదో చారిత్రక నిర్మాణం ఉందనే అనుమానంతో ఓ ఎన్జీవో, కొంతమంది స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు చెత్త మొత్తాన్ని తొలగించారు. తీరా చూస్తే ఆ చెత్త కింద ఓ అద్భుతం కనిపించింది. ఆనాటి అరుదైన మెట్ల బావి బయటపడింది.

ఈ ఫోటోలో ఉన్న డంపింగ్ యార్డ్‌.. భన్సీలాల్ పేటలోని పురాతన నిర్మాణం. కాలనీలోని చెత్త అంత తెచ్చి ఇక్కడే వేస్తుంటారు. కానీ ఎవరికీ తెలియదు దానికిందే చారిత్రక వైభవాన్ని చాటే అద్భుత నిర్మాణం ఉందని. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి చివరకు అధికారులకు చేరింది. దాంతో అధికారులు అక్కడికి చేరుకుని చెత్తను తొలగించడంతో భయటపడిన అద్భుత కట్టడాన్ని చూసి అవాక్కయ్యారు. అద్భత కట్టడం.. అరుదైన మెట్ల బావిని చూసి అంతా నోరెళ్లబెట్టారు. భన్సీలాల్ పేట్ లోని నల్లపోచమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న ఈ బావిని నాగన్నకుంట మెట్లబావిగా గుర్తించారు.

ఈ మెట్ల బావి అంతా రాతి, లైమ్ స్టోన్‌తో నిర్మించారు. దాదాపు 300 ఏళ్లనాటి చరిత్ర కలిగిన పురాతన బావి 90 ఏళ్ల కిందట మరుగునపడ్డట్లు అధికారులు భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలు కూడా లేని ఈ మెట్ల దారి ఉన్న భారీ బావి అందరిని ఆకట్టుకుంటోంది. జనావాసాల మధ్య ఉన్న చెత్త కుప్ప నుంచి 800 లారీల చెత్త, డబ్రీస్ ను తొలగిస్తే ఈ కట్టడం బయటికొచ్చింది. ఈ భారీ ఊట నీటి బావికి వెళ్లేందుకు 50 నుంచి 70 పైగా మెట్లు ఉన్నాయి. 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పు, 53 అడుగుల లోతు బావి ఆనాటి వైభవాన్ని చాటుతోంది.

అద్భుత నిర్మాణ కౌశల్యంతో ఉన్న ఈ నీటి బావిని అప్పట్లో రాజులు తవ్వించినట్లు సమాచారం. పూర్తిస్థాయి 200 అడుగులకు పైగా ఉన్న ఈ భారీ బావి పర్యాటక సంపదగానే చెప్పాలి. నగరంలోని ఇలాంటి మెట్ల బావులను గుర్తించి పునర్వైభవం తీసుకొచ్చేందుకు సర్కారు కృషి చేస్తోంది. అందులో భాగంగానే నగరం నడిబొడ్డున ఇలాంటి ప్రాచీన అందమైన బావి బయటపడిందని అధికారులు చెబుతున్నారు.

రాజుల కాలం నుంచి సమీప ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చిన పురాతన బావి మరుగునపడటం దురదృష్టకరం. అలాంటి బావిని వెలుగులోకి తీసుకొచ్చి పునరుద్ధరణ చేసిన సర్కారును స్థానికులు కొనియాడుతున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పురాతన బావిని ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

ఇదిలాఉంటే.. ఈ బావితో తమకు ఎంతో అనుబంధ ఉండేదని వృద్ధులు చెబుతున్నారు. మెట్ల పక్కన నిర్మాణాలపై ఆటలాడుకునేవాళ్లమని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈత కొట్టిన గుర్తులు ఇంకా కళ్లముందే ఉన్నాయన్నారు. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కృషితోనే దీనికి పునర్ వైభవం దక్కిందని చెబుతున్నారు.

ఈ కొద్దిరోజులు చెత్తతో నిండిన స్థలాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండాపోయింటే ఎదో ఒక అక్రమ కట్టడం వెలిసేదని.. అద్భుత కట్టడం శాశ్వతంగా కనుమరుగయ్యేది. దిగుడు బావుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం నగరంలో ఇలాంటి మరో ఆరు బావులను తీర్చిదిద్దుతోంది. బాపుఘాట్, గచ్చిబౌలి, గుడిమల్కాపూర్, శివబాగ్, సీతారాంబాగ్ లలో ఈ బావులు పునురుద్ధరణకు నోచుకున్నాయి. దీని ప్రారంభం తర్వాత మెట్ల బావులు పర్యాటక ప్రాంతాలుగా మెరిసిపోనున్నాయి.

విద్యా సాగర్, టీవీ9 రిపోర్టర్.

Also read:

TATA – Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..

AP Backlog Jobs: నెలకు రూ.92,000ల జీతంతో.. ఆంధ్రప్రదేశ్‌‌లో పలు టీచింగ్ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలివే!

Viral Video: ఇదేందిరయ్యా.. వెజ్ ఫిష్ ఫ్రై అంట.. నెట్టింట వైరల్ అవుతున్న మరో కొత్త వంటకం..