Telangana: అక్కడి పేదలకు గుడ్ న్యూస్.. ప్రారంభోత్సవానికి సిద్దమైన 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లు

Telangana: అక్కడి పేదలకు గుడ్ న్యూస్.. ప్రారంభోత్సవానికి సిద్దమైన 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లు
Telangana 2BHK Housing Scheme

ఆర్.సి పురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ క్రింద చేపట్టిన 15,600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయి. ఇళ్లకు సకల హంగులతో పేదలకు మౌలిక సదుపాయం కల్పనలో చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్టమైన, మెరుగైన సౌకర్యాలు కల్పించారు.

Ram Naramaneni

|

Jan 27, 2022 | 5:52 PM

Telangana Double Bedroom Housing scheme: గూడులేని నిరుపేదలకు సొంతిల్లు కల సాకారం త్వరలోనే నెరవేరబోతున్నది. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఆకాంక్ష తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) సంకల్పంతో జిహెచ్ఎంసి(GHMC) పరిధిలో ఎంపిక చేసిన 111 ప్రాంతాల్లో ఒక లక్ష గృహాల నిర్మాణ లక్ష్యం త్వరలో నెరవేరనున్నది. ఆర్.సి పురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ క్రింద చేపట్టిన 15,600 గృహాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయి. మరి ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసే అతి పెద్ద హౌసింగ్ ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి కమిషనర్ ప్రోద్బలంతో హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి సంకల్పించిన లక్ష్యాన్ని నెరవేర్చారు. సకల హంగులతో పేదలకు మౌలిక సదుపాయం కల్పనలో చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్టమైన, మెరుగైన సౌకర్యాలు కల్పించారు. రూ. 1422.15 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ లకు తీసి పోకుండా సకల హంగులతో నిర్మించారు.

115 బ్లాక్ లు గృహాల నిర్మాణాలు చేపట్టారు. అవసరాన్ని బట్టి ప్రతి బ్లాక్ రెండు లేదా మూడు స్తేయిర్ కేస్ ను ఏర్పాటు చేశారు. స్టిల్ట్ పార్కింగ్ తో పాటు పెవ్ బ్లాక్స్ , వాచ్ మెన్ గది ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫిటింగ్, 8 మంది కెపాసిటీ గల ప్రతి బ్లాక్ కు రెండు చొప్పున 234 లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు. లిఫ్ట్ , గృహాలకు నిరంతర విద్యుత్ కోసం పవర్ బ్యాకప్ కోసం ప్రత్యేక జనరేటర్ ఏర్పాటు చేశారు.

ప్రత్యేక మౌలిక వసతులు, సదుపాయాలు

* 6 నుండి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల రోడ్డు భవిష్యత్తులో రోడ్డు కట్టింగ్ లేకుండా నాలా ఏర్పాటు.

* 21 వేల కే.ఎల్ సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ కేబుల్ ఏర్పాటు.

* కామన్ ఏరియాలో లైటింగ్ లిఫ్టులకు వాటర్ సప్లై , ఎస్.టి.పి లకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం 30 కేవిఎ నుండి 400 కె.వి.ఎ వరకు 133 జనరేటర్ ఏర్పాటు చేశారు.

* రూ. 10 కోట్ల వ్యయంతో 9 ఎం.ఎల్.డి సామర్థ్యం గల ఎస్.టి.పి నీ EMBBR ( Enhanced moving Bed Bio reactor) పద్దతిలో ఏర్పాటు చేసి చుట్టూ రోడ్డు వసతి కల్పించారు.

* మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసి ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులకు నీటి అందించేందుకు అవసరమైన పైప్ లైన్ ఏర్పాటు.

వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు.

* మురికి నీరు బాక్సుల పైన 10.55 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు.

* 10.05 కి మీ త్రాగు నీటి పైప్ లైన్,

* 10.60 కి మీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్,

* 137 విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు,

* వీధి దీపాల కోసం 528 పోల్స్,

* హైమస్కు లైట్ కోసం 11 పోల్స్ ఏర్పాటు చేశారు.

* 54000 స్క్వేర్ ఫీట్ గల 3 షాపింగ్ కాంప్లెక్స్ లలో 118 షాపులు ఏర్పాటు.

సామాజిక వసతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.

* కాలనీ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్ వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, కిడ్స్ ల్లాట్ టట్స్, మల్టీ పర్పస్ గ్రౌండ్, హంపి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం బతుకమ్మ ఘాట్ ఏర్పాటు.

* నివసించే ప్రజల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్ ఏర్పాటు.

* ప్లే స్కూల్, అంగన్ వాడి సెంటర్,

* బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు.

* ప్రాథమిక , ఉన్నత పాఠశాల బస్ టెర్మినల్, బస్ స్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మిల్క్ బూత్ లు, పెట్రోల్ బంకులు పోస్టాఫీసు, ఎ.టి.ఎం బ్యాంక్, ఏర్పాటు కు చర్యలు.

* సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

Also Read: కొత్త జిల్లాల ఏర్పాటుపై బాలకృష్ణ ఫస్ట్ రియాక్షన్.. హిందూపురం గురించి కీలక వ్యాఖ్యలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu