TATA – Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా టాటాల చేతికి చేరింది. అధికారికంగా టాటా సన్స్ కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ..

TATA - Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..
Air India
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 27, 2022 | 5:33 PM

TATA – Air India: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా(air india) టాటాల(TATA) చేతికి చేరింది. అధికారికంగా టాటా సన్స్(TATA Sons) కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా మొత్తం టాటా సన్స్ అనుబంధ సంస్థ టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( tata group) కి బదిలీ చేయబడిందని DIPAM కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తెలిపారు. ఇక నుంచి ఎయిర్ ఇండియా కొత్త యజమాని టాటా గ్రూప్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. “ఈ ప్రక్రియ పూర్తయిందని.. ఎయిరిండియా తిరిగి రావడంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఎయిర్‌లైన్‌ను ప్రపంచ స్థాయికి తీసుకురావడమే మా ప్రయత్నం. ఎయిరిండియా విమానాన్ని సమయానికి నడపడమే టాటా గ్రూప్ మొదటి టార్గెట్ అని వెల్లడించింది.

ప్రభుత్వ ప్రకటన..

ఎయిర్ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీలు పూర్తయ్యాయి. అనంతరం కేంద్ర సమాచార ప్రసారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2,700 కోట్లను ప్రభుత్వం స్వీకరించడం.. 15,300 రుణాన్ని నిలుపుకోవడంతో ఎయిర్ ఇండియా (100% ఎయిర్ ఇండియా షేర్లు .. దాని అనుబంధ సంస్థ AIXL మరియు AISATS యొక్క 50% షేర్లు) వాటాలను వ్యూహాత్మక భాగస్వామి టాటా గ్రూప్ కు బదిలీ చేయడం జరిగింది.

ఎయిర్ ఇండియా యొక్క వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అత్యధిక ధర 18000 వేల కోట్ల బిడ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, 11 అక్టోబర్ 2021న బిడ్డర్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేయబడింది.

షేర్ కొనుగోలు ఒప్పందం పై (SPA) 25 అక్టోబర్, 2021న సంతకం చేయబడింది. ఆ తర్వాత, టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్,ఎయిర్ ఇండియా , ప్రభుత్వం షేర్ కొనుగోలు ఒప్పందం లో రూపొందించిన షరతుల సమితిని,యాంటీ ట్రస్ట్ బాడీలు, రెగ్యులేటర్లు, రుణదాతలు, మూడవ పార్టీలను సంతృప్తిపరిచే దిశగా పనిచేశాయి.

ఇది కాకుండా, అనేక ఇతర మార్పులను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలిపింది. ఇందులో సీటింగ్ అరేంజ్‌మెంట్‌తో పాటు క్యాబిన్ సిబ్బంది దుస్తుల కోడ్‌ను మార్చడం కూడా ఉంది. టాటా గ్రూప్ వ్యాపారం కూడా హోటల్ పరిశ్రమలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం కూడా అందుతుంది.

ఇప్పుడు రతన్ టాటా వాయిస్ రికార్డ్ అన్ని ఎయిర్ ఇండియా విమానాలలో ప్లే చేయబడుతుంది. అక్టోబర్ 2021లో, టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను 18000 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బిడ్‌ను టాటా సన్స్ అనుబంధ సంస్థ టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారిపోయింది.

ఎయిర్‌లైన్ కార్యకలాపాల కోసం టాటా గ్రూప్ ఎస్‌బిఐ కన్సార్టియం పొందనుంది

SBI నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఎయిర్ ఇండియా నిర్వహణ కోసం టాటా గ్రూప్‌కు రుణాలు అందించనున్నట్లుగా తెలుస్తోంది. కన్సార్టియంలో SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. కన్సార్టియం టాటా గ్రూప్‌కు టర్మ్ లోన్‌లతో పాటు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లను అందిస్తుంది. Tata Group అనుబంధ సంస్థ Talace Private Limited 8 అక్టోబర్ 2021న ఎయిర్ ఇండియాను 18000 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి: PRC: చ‌ర్చ‌లకు రండి.. మీరు మా శ‌త్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల సూచన..