AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

చేపల్లా నీటిలో ఈత కొట్టడం మనిషికి తెలుసు.. పక్షుల్లా ఆకాశంలో ఎగరడం మనిషికి తెలుసు.. కానీ నీటిపై మునిగిపోకుండా మ్యాజిక్ చేసినట్లు పరిగెత్తడం మనిషికి సాధ్యమా? అస్సలు కాదు.. కానీ ప్రకృతి సృష్టిలో ఒక వింత జీవికి మాత్రం ఇది వెన్నతో పెట్టిన విద్య. శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయి దీనికి జీసస్ క్రైస్ట్ లిజార్డ్ అని పేరు పెట్టారు. దీన్ని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..
Basilisk Lizard Walking On Water
Krishna S
|

Updated on: Feb 25, 2026 | 10:08 PM

Share

ప్రకృతి సృష్టిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. చేపలను చూసి మానవుడు ఈత నేర్చుకున్నాడు, పక్షులను చూసి విమానాన్ని కనిపెట్టాడు. కానీ నీటిపై మునిగిపోకుండా పరిగెత్తడం మాత్రం మనిషికి ఇప్పటికీ అందని ద్రాక్షే. అయితే ఈ ప్రపంచంలో ఒక జీవికి మాత్రం నీటిపై నడిచే అద్భుత శక్తిని ప్రకృతి ప్రసాదించింది. అదే బాసిలిస్క్ బల్లి. బైబిల్ కథల ప్రకారం.. జీసస్ క్రైస్ట్ నీటిపై నడిచారని చెబుతారు. సరిగ్గా అదే విధంగా ఈ బల్లి కూడా నీటిపై మునిగిపోకుండా పరిగెత్తగలదు కాబట్టి దీనికి జీసస్ క్రైస్ట్ బల్లి అని పేరు వచ్చింది. ఇది సాధారణంగా వేటగాళ్ల నుండి తప్పించుకోవడానికి నీటిని రన్‌వేగా వాడుకుంటుంది.

నీటిపై ఎలా నడవగలుగుతోంది?

ఈ బల్లికి నీటిపై నడిచే శక్తి రావడానికి దాని శరీర నిర్మాణం, వేగమే ప్రధాన కారణం. బాసిలిస్క్ బల్లి పాదాలకు వెడల్పుగా ఉండే కాలి వేళ్లు ఉంటాయి. ఇవి నీటిపై అడుగు వేసినప్పుడు గాలి పాకెట్‌లను సృష్టిస్తాయి. అది తన పాదాలతో నీటిని బలంగా వెనక్కి నెడుతుంది. దీనివల్ల నీటిలో గాలి బుడగలు ఏర్పడతాయి. ఆ బుడగలు పగిలిపోయేలోపే తన పాదాన్ని బయటకు తీసి మరో అడుగు ముందుకు వేస్తుంది. ఈ బల్లి నీటిపై సెకనుకు దాదాపు 1.5 మీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. ఈ వేగం వల్ల గురుత్వాకర్షణ శక్తి దానిని కిందకు లాగలేకపోతుంది. పరిగెత్తే సమయంలో తన తోకను అటు ఇటు ఊపుతూ పడవకు చుక్కానిలా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది.

మనిషికి ఇది సాధ్యమేనా?

ఒక మనిషి ఈ బల్లిలాగా నీటిపై మునిగిపోకుండా నడవాలంటే.. గంటకు కనీసం 108 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా మనుషులు పరిగెత్తే వేగం కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. అందుకే ఇది మనిషికి అసాధ్యం.. కానీ బాసిలిస్క్ బల్లికి వెన్నతో పెట్టిన విద్య..

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..