జిమ్‌లో అలియా భట్ రచ్చ.. ‘సఫర్ అండ్ స్మైల్’ అంటూ వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!
సినిమా తెరపై తన అద్భుతమైన నటనతో మెప్పించే ఆ స్టార్ హీరోయిన్, ఫిట్‌నెస్ విషయంలోనూ అస్సలు తగ్గదు. ఎంత బిజీగా ఉన్నా సరే జిమ్‌లో వర్కవుట్లు చేయడం ఆమె దినచర్యలో ఒక భాగం. తాజాగా ఆమె తన ఫ్రెండ్స్, స్టాఫ్‌తో కలిసి చేసిన ఇంటెన్స్ వర్కవుట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆమె ఒకవైపు గ్లోబల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూనే, మరోవైపు యాక్షన్ సినిమాల్లో అదరగొట్టడానికి సిద్ధమవుతోంది. పెళ్లయి, ఒక పాపకు తల్లి అయినప్పటికీ మునుపటి కంటే మరింత ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆమె హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి జిమ్‌లో ఆమె పడుతున్న కష్టం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ పక్కా ఫిట్‌నెస్ ప్లాన్ అనుసరిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. అలియా భట్.
ఇంటెన్స్ వర్కవుట్..
అలియా భట్ ఫిట్‌నెస్ కోచ్ కరణ్ సాహ్ని పర్యవేక్షణలో ఈ వర్కవుట్ సెషన్ సాగింది. ఇందులో అలియాతో పాటు ఆమె మేకప్ ఆర్టిస్ట్ పునీత్ బి సైనీ, హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఈ సెషన్‌ను ‘ఫుల్ బాడీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ సర్క్యూట్’ అని పిలుస్తున్నారు. దీని పేరు వినగానే అలియా తనదైన శైలిలో స్పందిస్తూ.. “నువ్వు ఆ వర్కవుట్ పేరు చెప్పేలోపు వీడియో అయిపోతుంది” అంటూ తన స్నేహితులపై జోకులు వేస్తూ అందరినీ నవ్వించింది.
View this post on Instagram
ఈ వర్కవుట్ వ్లాగ్ లో అలియా చాలా కఠినమైన వ్యాయామాలను ఎంతో సులభంగా చేయడం కనిపిస్తుంది.
- ఇండోర్ వర్కవుట్: ఇందులో భాగంగా 15 సార్లు క్లాప్ పుష్-అప్స్, పుల్-అప్స్, మరికొన్ని స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేశారు.
- అవుట్‌డోర్ సెషన్: బయట ప్రదేశంలో లెగ్ రైజెస్, ప్లాంక్ టు మౌంటైన్ క్లైంబర్స్, రష్యన్ ట్విస్ట్స్, సింగిల్ ఆర్మ్ డంబెల్ స్వింగ్స్ వంటివి చేస్తూ అలియా తన బాడీ పవర్ ను నిరూపించుకుంది.
- కూల్ డౌన్: చివరగా మనశ్శాంతి కోసం, శరీరాన్ని రిలాక్స్ చేయడానికి అందరూ కలిసి మెడిటేషన్ (ధ్యానం), శ్వాస సంబంధిత వ్యాయామాలు చేశారు.
అలియా భట్ తన టీమ్ తో కలిసి ఉన్న ఈ అన్‌ఫిల్టర్డ్ వీడియో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. “అలియా తన సొంత మనుషుల దగ్గర ఒక చిన్నపిల్లలా ఉంటుంది.. ఇది చూడటానికి చాలా బాగుంది” అని కొందరు కామెంట్ చేస్తుంటే, “నువ్వే మాకు పెద్ద ఇన్‌స్పిరేషన్” అని మరికొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అలియా భట్ తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటించబోతోంది. అలాగే స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’ కోసం కూడా ఆమె సిద్ధమవుతోంది. వృత్తిపరమైన బాధ్యతలను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఆరోగ్యంపై ఆమె చూపిస్తున్న శ్రద్ధ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
