AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రెగ్నెన్సీ ఫ్యాషన్‌లో సోనమ్ కపూర్ ప్రయోగం.. బేబీ బంప్‌తో చాక్లెట్ బ్రౌన్ డ్రెస్‌లో మెరిసిన భామ!

ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఒక రోల్​ మోడల్​. ఏ దుస్తులు ధరించినా అందులో తనదైన ముద్ర వేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణంగా గర్భధారణ సమయంలో చాలామంది సౌకర్యం కోసం వదులుగా ఉండే దుస్తులను ఎంచుకుంటారు. కానీ, ఆ అభినేత్రి మాత్రం తన బేబీ బంప్‌ను గర్వంగా ప్రదర్శిస్తూ, మెటర్నిటీ ఫ్యాషన్‌కు సరికొత్త నిర్వచనం చెబుతోంది.

ప్రెగ్నెన్సీ ఫ్యాషన్‌లో సోనమ్ కపూర్ ప్రయోగం.. బేబీ బంప్‌తో చాక్లెట్ బ్రౌన్ డ్రెస్‌లో మెరిసిన భామ!
Sonam Kapoor
Nikhil
|

Updated on: Feb 25, 2026 | 9:36 PM

Share

ఒక ఈవెంట్‌లో ఆమె ధరించిన చాక్లెట్ బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆమె అడుగువేస్తే అది ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్. బాలీవుడ్ లో ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడంలో ఆమెను మించిన వారు లేరు. ప్రస్తుతం రెండోసారి తల్లి కాబోతున్న ఆమె, తన గర్భధారణ సమయాన్ని ఎంతో స్టైలిష్ గా ఆస్వాదిస్తోంది. సాధారణంగా గర్భిణీలు తమ శరీరాకృతిని దాచడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆమె మాత్రం మారుతున్న తన శరీరాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. వినూత్నమైన కట్స్, విభిన్నమైన టెక్స్చర్స్ తో మెటర్నిటీ వేర్ ను ఒక హై-ఫ్యాషన్ ఆర్ట్ లా మార్చేసిన ఆ తార మరెవరో కాదు.. సోనమ్ కపూర్.

చాక్లెట్ బ్రౌన్ మ్యాజిక్

ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన కస్టమ్ మేడ్ డ్రెస్ లో సోనమ్ కపూర్ ఇటీవల ఒక ఈవెంట్ లో మెరిసింది. గాఢమైన చాక్లెట్ బ్రౌన్ రంగులో ఉన్న ఈ అవుట్‌ఫిట్ మొదటి చూపులో సాదాసీదాగా అనిపించినా, దగ్గరగా గమనిస్తే అందులోని పనితనం ఆశ్చర్యపరుస్తుంది. రిచ్ బ్రౌన్ ఫ్యాబ్రిక్ ను ప్లీట్స్ పద్ధతిలో డిజైన్ చేయడం వల్ల ఆ దుస్తులకు ఒక పక్కా స్ట్రక్చర్ వచ్చింది.

ఈ డ్రెస్ లోని ‘డీప్ వి’ నెక్ లైన్ ఆమెకు హుందాతనాన్ని జోడించింది. భుజాల నుండి కిందకు జాలువారుతున్న కేప్ వంటి డిజైన్ ఒక హై-ఫ్యాషన్ డ్రామాను క్రియేట్ చేసింది. నడుము భాగంలో ఉన్న ప్లీట్స్ ఒక రిపుల్ ఎఫెక్ట్ ను ఇస్తూ, ఆమె బేబీ బంప్ ను ఎంతో అందంగా హైలైట్ చేశాయి. భారీ వర్క్ లేదా మెరుపులు లేకుండా కేవలం ఫ్యాబ్రిక్ టెక్స్చర్, షేప్ తోనే ఈ అవుట్‌ఫిట్ అందరినీ కట్టిపడేసింది. ఈ డ్రెస్ నేల వరకు పొడవుగా ఉండి, సోనమ్ కు ఒక రాయల్ లుక్ ఇచ్చింది.

స్టైలింగ్, మేకప్..

సోనమ్ తన హెయిర్ ను వెనక్కి లాగి నీట్ గా బన్ లా చుట్టుకుంది. దీనివల్ల డ్రెస్ యొక్క వినూత్న ఆకృతి స్పష్టంగా కనిపించింది. మేకప్ విషయానికి వస్తే, సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ టచ్ తో ఆమె ముఖంలో ‘మామ్-టు-బీ’ కళ ఉట్టిపడింది. ఆభరణాల విషయంలో కూడా ఆమె చాలా పరిమితంగా ఉంటూ, కేవలం తన డ్రెస్ మాత్రమే హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడింది.

సంప్రదాయ మెటర్నిటీ వేర్ అంటే కేవలం వదులుగా ఉండే గౌన్లు మాత్రమే అనే భావనను సోనమ్ చెరిపివేసింది. తన మొదటి గర్భధారణ సమయంలోనే ఆమె బేబీ బంప్ ను హైలైట్ చేసే స్ట్రక్చర్డ్ పీసెస్ ను ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆధునిక మెటర్నిటీ ఫ్యాషన్ కు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెస్తోంది. సోనమ్ కపూర్ ఎంచుకునే దుస్తులు కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, అవి ఆమె వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు. మారుతున్న శరీరానికి తగ్గట్టుగా ఫ్యాషన్ ను మలుచుకోవడంలో సోనమ్​ కపూర్ స్టైలే వేరంటున్నారు నెటిజన్లు.

Follow Us