AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందిరయ్యా.. వెజ్ ఫిష్ ఫ్రై అంట.. నెట్టింట వైరల్ అవుతున్న మరో కొత్త వంటకం..

Vegetarian fish fry: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇటీవల కాలంలో సరికొత్త వంటకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విచిత్ర

Viral Video: ఇదేందిరయ్యా.. వెజ్ ఫిష్ ఫ్రై అంట.. నెట్టింట వైరల్ అవుతున్న మరో కొత్త వంటకం..
Vegetarian Fish Fry
Shaik Madar Saheb
|

Updated on: Jan 27, 2022 | 4:25 PM

Share

Vegetarian fish fry: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇటీవల కాలంలో సరికొత్త వంటకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విచిత్ర వంటకాల వీడియోలను చూసి ఆహార ప్రియులే నోరెళ్లబెడుతున్నారు. అయితే.. రోజూ చేసే వంటకాలకు కాస్త భిన్నంగా పలు కొత్త వంటలను ట్రై చేస్తున్నారు చెఫ్‌లు. ఇటీవల చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, పుచ్చకాయ మిల్క్ షేక్.. ఇలా ఒక్కటేమిటీ ఎన్నో రకాలు వంటకాలు (Dish) నెట్టింట్లో వైరల్ (Viral) అయిన సంగతి తెలసిందే. తాజాగా.. మరో సరికొత్త వంటకం వైరల్ అవుతుంది. అదే వెజ్ ఫిష్ ఫ్రై (Vegetarian fish fry).. వంటకం. అదేంటి ఫిష్ నాన్ వెజ్.. కదా.. వెజ్ ఫిష్ ఏంటీ అనుకుంటున్నారా..? మీరు విన్నది నిజమే.. ఈ వార్త చదవితే.. అంతా మీకే తెలుస్తుంది.

తూర్పు ఢిల్లీలోని ఒక ఫుడ్ జాయింట్ వారి మెనూలో సరి కొత్త ఐటమ్‌ను జోడించారు. అదే వేజ్ ఫిష్ ఫ్రై. ఇది విని ఢిల్లీకి చెందిన ఒక ఫుడ్ బ్లాగర్ వారి మెనూలో చేర్చబడిన ఈ వినూత్న వంటకాన్ని ప్రయత్నించడానికి వెళ్ళారు. అతనికి నచ్చిందా? లేదా అన్న అది తర్వాత సంగతి కానీ.. ప్రస్తుతం ఈ వంటకం తెగ వైరల్ అవుతోంది. ఈ వినూత్న వంటకాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ శాఖాహార చేపల వేపుడును ఢిల్లీలోని ఖన్నా తందూరి జంక్షన్ తయారు చేస్తోంది. దీంతో ఈ వంటకం గురించి విన్న యూట్యూబ్ ఛానెల్ ఫుడీ ఇన్కార్నేట్‌కు చెందిన అమర్ సిరోహి దుకాణాన్ని సందర్శించీ.. వెజ్ ఫిష్ ఫ్రైని ప్రయత్నించారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. ఫుడ్ బ్లాగర్ ఈ శాకాహార చేపను ఎలా తయారు చేయాలో దుకాణ యజమానితో చర్చిస్తున్నట్లు చూడవచ్చు. ఈ వంటకానికి కావాలసిన ప్రధాన పదార్థాలు సోయాబీన్, అల్లం వెల్లుల్లి పేస్ట్‌. వాటి ద్వారా చేప ఆకారాన్ని చేసి.. నూనేలో ఫ్రై చేస్తున్న సన్నివేశాలను కూడా చూడవచ్చు. ఫ్రై అయ్యాక చూస్తుంటే.. ఇది ఖచ్చితంగా చేపలా కనిపిస్తుంది. తీరా రుచి చూశాక బ్లాగర్ బాగుందంటూ కితాబిచ్చాడు.

అయితే ఈ కొత్త వంట ఆవిష్కరణ ఇంటర్నెట్‌లో అంతగా ఆకట్టుకోలేదు. ఎందుకో ఏమిటో కానీ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చూసుంటే.. అచ్చం చేపలానే ఉందని.. వెజ్ ఫిష్ ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral: పెళ్లైన 6నెలలకే కొడుకు మృతి.. కోడలిని ఉన్నతంగా చదివించి, రెండో పెళ్లి చేసిన అత్త..

Viral Video: గ‌గ‌న వీధుల్లో అద్భుత దృశ్యం.. ఈ డ్రోన్ అద్భుతాన్ని చూడ‌డానికి రెండు కళ్లు చాల‌వు..