AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లైన 6నెలలకే కొడుకు మృతి.. కోడలిని ఉన్నతంగా చదివించి, రెండో పెళ్లి చేసిన అత్త..

కోడలు ఇంట అడుగుపెట్టాక కొడుకు మరణిస్తే.. ఆమె రావడంతో ఇలా జరిగిందని సూటిపోటి మాటలు అనే అత్తమామలు అన్ని చోట్లా చూస్తూ ఉంటాం. అలాంటిది కొడుకు మరణిస్తే.. కోడలికి రెండో పెళ్లి జరిపించిన ఓ అత్త.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

Viral: పెళ్లైన 6నెలలకే కొడుకు మృతి.. కోడలిని ఉన్నతంగా చదివించి, రెండో పెళ్లి చేసిన అత్త..
Marriage
Ram Naramaneni
|

Updated on: Jan 27, 2022 | 3:15 PM

Share

Rajastan woman kanyadan: అత్తా- కోడళ్లు అనగానే.. వెంటనే వారి మధ్య గొడవలే గుర్తుకువస్తాయి. ప్రజంట్ జనరేషన్ యువతులు చాలామంది.. అత్తమామలతో కలిసి ఉండేందకు నిరాకరిస్తున్నారు కూడా. పెళ్లైన వెంటనే వేరు కాపురాలు పెట్టేస్తున్నారు. రియాల్టీని ఇంకొంచెం డ్రమిటైజ్ చేసి టీవీ సిరియల్స్(Tv Serials)లో అత్తా-కోడళ్లను బద్దశత్రువులుగా  చూపిస్తున్నారు. ఇక పెళ్లై(Marriage) మెట్టినింట అడుగుపెట్టిన కోడళ్లను.. కూతుర్లలాగా ట్రీట్ చేసే అత్తలు చాలా అరుదనే చెప్పాలి. అదేంటో తెలీదు.. తమ కూతురికి అత్తారింట బాగా జరగాలని కోరుకుంటారు. ఇంట్లో కోడలిని మాత్రం అంత మంచిగా చూసుకోరు. అయితే ఇప్పుడు చెప్పబోయే మహిళ మాత్రం.. కోడలి గురించి చాలా పరిణితితో ఆలోచించింది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. కొడుకు ఊహించని విధంగా మరణిస్తే.. కోడలిని పుట్టింటికి పంపించకుండా.. కన్న బిడ్డలా చూసుకుంది. ఉన్నత చదువులు చదివించి.. మంచి ఉద్యోగం వచ్చాక.. మరో వివాహం చేసింది. రాజస్థాన్ లోని సికార్ జిల్లా(Sikar District)లో ఈ ఘటన జరిగింది.

అక్కడ నివసించే కమలా దేవి, దిలావర్ దంపతులకు శుభం అనే ఓ కుమారుడు ఉండేవారు. గుణగణాలు చూసి 2016 మే 25న సునీత అనే అమ్మాయితో తన కుమారుడి పెళ్లి జరిపించింది కమల. పెళ్లి తర్వాత శుభం.. డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసేందుకు కిర్గిస్థాన్​కు వెళ్లారు. 2016 నవంబర్​లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అతడు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు. అయితే, కుమారుడి మరణం అనంతరం కోడలిని పంపించలేదు కమలా దేవి. తన ఇంట్లోనే ఉంచుకొని.. జీవితంలో ఉన్నతంగా నిలబడేలా ప్రోత్సాహం అందించింది. అత్త సహకారంతో చదువు కొనసాగించిన సునీత.. గ్రేడ్-1 లెక్చరర్ జాబ్ సంపాదించింది. జీవితంలో తనకాళ్లపై తాను నిలబడేలా ఎదిగింది. దీంతో సునీతకు దగ్గరుండి రెండో వివాహం చేయించింది కమలా దేవి. ఆ అత్త మంచి మనసు చూసి ఎంతగానే పొగుడుతున్నారు నెటిజన్లు.

Also Read: ‘పాల’కూట విషం.. పా’పాల’ బైరవులు.. బ్రాండెడ్ మిల్క్ అని తెస్తే.. బ్రతుకంతా విషమే