Telangana: 50 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్​ చేయించి పెళ్లాడిన వివాహిత.. ఎందుకో ఆరా తీయగా పోలీసులు షాక్

Telangana: 50 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్​ చేయించి పెళ్లాడిన వివాహిత.. ఎందుకో ఆరా తీయగా పోలీసులు షాక్
Representative image

కమలాపురానికి చెందిన ముత్యం శ్రీనివాస్ నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూనే ఫైనాన్స్‌కు డబ్బులు కూడా ఇచ్చేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు డైలీ వసూలు కింద కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు.

Ram Naramaneni

|

Jan 27, 2022 | 4:08 PM

Man kidnapped: ఇప్పుడు మీరు చదవబోయే వార్త.. సినిమాలోని పతాక సన్నివేశానికి ఏమాత్రం తక్కువకాదు. ఒకింత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. వరంగల్ జిల్లాలో 50 ఏళ్ల వ్యక్తి కిడ్నాపయ్యాడు. అతడిని పెళ్లి చేసుకునేందుకు ఓ వివాహిత సుపారీ గ్యాంగ్ తో కిడ్నాప్ చేయించింది. అవును.. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.  వరంగల్ జిల్లా(Warangal District) నర్సంపేట పట్టణం రెండో వార్డు పరిధిలోని కమలాపురానికి(Kamalapuram) చెందిన ముత్యం శ్రీనివాస్‌(50)ను పట్టపగలే కిడ్నాప్(Kidnap) చేయడంతో స్థానికంగా కలకలం రేపింది. లిక్కర్ షాపులో భాగస్వామిగా ఉన్న శ్రీనివాస్‌ను బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తన బైక్ పై వెళుతుండగా కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన శ్రీనివాస్‌ కుమారుడు భరత్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ జరపగా.. అదే గ్రామానికి చెందిన మహిళ విషయమై శ్రీనివాస్‌పై రెండు మార్లు కేసు నమోదయినట్లు గుర్తించారు.  ఆ కోణంలో దర్యాప్తు చేయగా.. వారికి అసలు విషయం బోధపడింది.

కమలాపురానికి చెందిన ముత్యం శ్రీనివాస్ నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూనే ఫైనాన్స్‌కు డబ్బులు కూడా ఇచ్చేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు డైలీ వసూలు కింద కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం రోజూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇంట్లోనే ఈ తతంగం అంతా జరగడంతో భరించలేకపోయిన ఆ మహిళ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన వైవాహిక జీవితంలో కలతలకు శ్రీనే కారణమని ఆమె ఆరోపించింది. 2 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పరిహారంగా గతంలో ఇచ్చిన అప్పును మాఫీ చేయడంతో పాటు.. సదరు మహిళకు శ్రీను అదనంగా లక్షన్నర ఇవ్వాలని పెద్దలు తీర్మానం చేశారు. అక్కడితో ఆగని ఆమె.. శ్రీను ఆస్తిలో వాటా దక్కించుకోవాలని స్కెచ్ వేసింది. తనకు మరో ఆధారం లేదని.. పెళ్లి చేసుకోమని అడిగింది. అందుకు శ్రీను ససేమేరా అన్నారు. ఎలాగైనా శ్రీను ఆస్తి దక్కించుకోవాలని.. బలంగా ఫిక్సయిన ఆమె కిడ్నాప్ స్కెచ్ గీసింది. ఓ సుపారీ గ్యాంగ్​కు డబ్బు ఇచ్చి అతడిని కిడ్నాప్ చేయించింది. బుధవారం రోజున పట్టణ శివారులో సుపారీ గ్యాంగ్ సభ్యులు మాదన్నపేట కట్ట వద్ద నుంచి వస్తున్న శ్రీనును కిడ్నాప్ చేసి.. కారులో బలవంతంగా ఎక్కించుకుని పాకాల వైపు వెళ్లారు.

అయితే తన తండ్రి కిడ్నాప్ విషయన్ని శ్రీను కుమారుడు భరత్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఫాలో అవుతున్నారని గ్రహించిన సుపారీ గ్యాంగ్.. శ్రీనును, మహిళను గంజేడు అడవిలోకి తీసుకువెళ్లి బలవంతంగా దండలు మార్పించి ఫొటోలు తీశారు. కొంత ఆస్తి రాసివ్వాలని అతడిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయం పెద్ద మనుషుల వద్ద తేల్చుకుందామని.. శ్రీను చెప్పగా.. అతడిని మహిళ ఇంట్లో వదిలేసి పరారయ్యారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్​ను, మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని వారిని విచారిస్తున్నారు.

Also Read: Viral: పెళ్లైన 6నెలలకే కొడుకు మృతి.. కోడలిని ఉన్నతంగా చదివించి, రెండో పెళ్లి చేసిన అత్త..

‘పాల’కూట విషం.. పా’పాల’ బైరవులు.. బ్రాండెడ్ మిల్క్ అని తెస్తే.. బ్రతుకంతా విషమే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu