Hyderabad: భాగ్యనగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం.. కరోనా సోకిందన్న భయంతో..
Software Employee Suicide: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వందలాది మరణాలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ
Software Employee Suicide: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వందలాది మరణాలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 లక్షలకు పైగా (Covid-19) కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. అయితే.. కరోనా వచ్చినా కానీ.. మరో ధైర్యంతో మహమ్మారి ఓడించవచ్చని వైద్య నిపుణులు, కరోనా నుంచి కోలుకున్నవారు పదే పదే పేర్కొంటున్నారు. అయినప్పటికీ కొంతమంది కరోనా (Coronavirus) సోకిందన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కరోనా సోకిందన్న భయంతో, మానసిక వేదనతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గురువారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో నివసిస్తోంది. ఈ నెల 21న అలేఖ్య అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. అయితే ఈ పరీక్ష ఫలితంలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో అప్పటినుంచి అలేఖ్య ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులతో నిత్యం ఫోన్‌లో కూడా మాట్లాడుతోంది. అయితే.. రెండు రోజుల అనంతరం ఈనెల 23వ తేదీ సాయంత్రం తల్లిదండ్రులు అలేఖ్యకు ఫోన్ చేశారు. ఆమె ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అలేఖ్య నివాసానికి చేరుకున్నారు. అనంతరం పరిశీలించగా.. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. అనంతరం వారు పోలీసులకు సమాచారమిచ్చారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: