Hyderabad: కొడుకుని చూడనివ్వకుండా అడ్డుకున్న భర్త.. తీవ్ర మనస్తాపంతో భార్యఆత్మహత్య!

హైదరాబాద్ మహానగర శివారులో విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.

Hyderabad: కొడుకుని చూడనివ్వకుండా అడ్డుకున్న భర్త.. తీవ్ర మనస్తాపంతో భార్యఆత్మహత్య!
Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 27, 2022 | 12:18 PM

Woman hangs self: హైదరాబాద్ మహానగర శివారులో విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘట ఎంఎం పహాడీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులు తాళలేక ఇంట్లో ఉరేసుకుని గృహిణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎంఎం పహాడీ ప్రాంతంలో శాజహా బేగం, ఇమ్రాన్ నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలుగా కూడా ఉన్నారు. తరుచు వేధింపులకు పాల్పడుతుండటంతో భర్తను దూరం పెడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భార్య శాజహా బేగంను హతమార్చేందుకు భర్త ఇమ్రాన్ విషమిచ్చాడు. బ్రతికి బయటపడ్డ శాజహా బేగం పెద్దల సమక్షంలో విడిపోయారు. భర్త వేధింపులు భరించలేక 90 రోజుల క్రితం విడాకులు తీసుకున్న శాజహా బేగం వేరుగా ఉంటోంది.

ఇదిలావుంటే, షాజహాన్ బేగం పెద్ద కొడుకుని కలవనివ్వకుండా తిరిగి వేధింపులు మొదలుపెట్టాడు ఇమ్రాన్. దీంతో తీవ్ర మస్థాపానికిగురైన శాజహా బేగం.. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

తన కూతురు చావుకు ఇమ్రాన్ కారణమని, అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని శాజహా బేగం కుటుంబ సభ్యులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.

Read Also…. Budget 2022: ఈ ఏడాది కూడా డిజిటిల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!