AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad Jobs: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు… నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక‌..

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కి చెందిన ఈ బోర్డు కాంట్రాక్ట్ విధానంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

Secunderabad Jobs: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు... నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక‌..
Narender Vaitla
|

Updated on: Jan 27, 2022 | 11:58 AM

Share

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కి చెందిన ఈ బోర్డు కాంట్రాక్ట్ విధానంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో గైన‌కాలజిస్ట్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్‌, అనెస్థీటిస్ట్‌, స్టాఫ్ న‌ర్సు ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో జీఎన్ఎం/బీఎస్సీ న‌ర్సింగ్‌, ఎంబీబీఎస్‌, డీఏ/డీజీవో/ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత ప‌నిలో అనుభవం త‌ప్ప‌నిస‌రి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 35 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు సంబంధిత ప‌త్రాల‌తో నేరుగా వాక్ ఇన్‌ ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకావాల్సి ఉంటుంది.

* ఫిబ్ర‌వ‌రి 4న నిర్వ‌హించ‌నున్న ఈ వాక్‌ ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 25,000 నుంచి రూ. 1,20,000 వ‌ర‌కు జీతంగా చెల్లిస్తారు.

* వాక్‌ ఇన్ ఇంట‌ర్వ్యూల‌ను స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, కంటోన్మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ బొల్లారం, సికింద్రాబాద్ అడ్ర‌స్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్ బారిన పడ్డారంటే..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. UAN పాస్‌వర్డ్ మర్చిపోయారా.. ఇలా చేయండి..?

Russells Viper Snake: బాబోయ్‌.. ఏడడుగుల రక్తపింజర.. పైగా నిండు గర్భిణీ..! ఈ వీడియో చుస్తే షాక్ అవుతారు..

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు