AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఛీ.. సాటి మహిళలే దారుణానికి ఒడిగట్టారు.. యువతిపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత..

Alleged Rape Survivor Paraded: అత్యాచార బాధితురాలికి ఆసరాగా నిలిచి.. చేయూతనివ్వాల్సిన సాటి మహిళలే దారుణానికి ఒడికట్టారు. బాధితురాలికి

Watch Video: ఛీ.. సాటి మహిళలే దారుణానికి ఒడిగట్టారు.. యువతిపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 27, 2022 | 5:58 PM

Share

Alleged Rape Survivor Paraded: అత్యాచార బాధితురాలికి ఆసరాగా నిలిచి.. చేయూతనివ్వాల్సిన సాటి మహిళలే దారుణానికి ఒడికట్టారు. బాధితురాలికి గుండు కొట్టించి ముఖానికి నల్లటి సిరా పూసి.. చెప్పుల దండవేసి సాటి మహిళలు చప్పట్లతో ఆమెను ఉరేగిస్తూ హింసించారు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ ( Delhi) లోని కస్తూర్బా నగర్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహిళలు చేసిన నిర్వాకంపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఈ వీడియోను ట్విట్ చేసి.. ఇలా చేసిన మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 72 గంటల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆమె పోలీసులను కోరారు. కాగా.. ఈ ఘటనపై (Delhi Police) పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు నలుగురు మహిళలను (Woman) అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని 20 ఏళ్ల ఓ యువతిపై అక్రమంగా మద్యం, డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో మానసిక, భౌతిక దాడి జరిగింది. ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నలుపు రంగు పూసి, చెప్పుల దండ వేసి వీధుల్లో తిప్పుతూ.. చప్పట్లతో హేళన చేస్తూ రేప్‌కు ఏమాత్రం తీసిపోకుండా స్థానిక మహిళలు హింసించారు. అయితే.. సాటి మహిళలే ఆమెపై ఈ దారుణానికి పాల్పడేలా పథకం రచించారని పోలీసులు పేర్కొన్నారు.

గతంలో బాధితురాలిని ఓ యువకుడు ప్రేమించాడు. అయితే.. కొన్ని రోజుల క్రితం అతను చనిపోయాడు. దీంతో ఆమెపై కక్ష్య పెంచుకున్న కుటుంబసభ్యులు.. సామూహిక అత్యాచారానికి పాల్పడేలా ప్రేరేపించారని పేర్కొంటున్నారు. ఈ ఘటన అనంతరం ఆమెను కొట్టి.. గుండు కొట్టించి.. చెప్పుల దండ వేసి హేళన చేస్తూ ఊరేగించారని పోలీసులు తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆమెను ఆసుపత్రికి తరలించారని.. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Hooch Tragedy: మళ్లీ కాటేస్తున్న కల్తీ మద్యం.. గంటల వ్యవధిలోనే ఆరుగురు బలి..

Hyderbad News: మద్యం మత్తులో యువతి వీరంగం.. రోడ్డుపై వెళ్తున్న వారిని తన కారుతో..