Work from home: చీటింగ్‌.. చీటింగ్‌.. ఒకే రోజు కర్నూలు, ఆదిలాబాద్‌, చిత్తూరు జిల్లాలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మోసాలు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లో 100కు పైగా బ్యాంక్ అకౌంట్ లను తెరిపించి కేరళ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ల నుండి సిమ్ కార్డులను సేకరించి నవ కిషోర్ కి అందజేసినట్లు విచారణ లో తేల్చారు పోలీసులు. ఈ కేసులో..

Work from home: చీటింగ్‌.. చీటింగ్‌.. ఒకే రోజు కర్నూలు, ఆదిలాబాద్‌, చిత్తూరు జిల్లాలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మోసాలు..
Work From Home Jobs
Follow us

|

Updated on: Aug 20, 2021 | 12:54 PM

ఉద్యోగాల పేరుతో మోసం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు మూడు చోట్ల ఇలాంటి చీటింగ్‌ జరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పోలీస్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏకంగా కోటి రూపాయలు వసూలు చేశారు కేటుగాళ్లు. ఒక్కొక్కరి నుంచి ఏడు లక్షలు వసూలు చేశారు. కర్నూలు డిఐజి పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ సృష్టించి.. అవుకు, అల్లూరులో ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. దీంతో ఇప్పటి ఈ కేసులో నలుగురిని అరెస్ట్‌ చేసి, మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని చీటింగ్‌ చేసే ఇలాంటి మోసగాళ్ల వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఇలాంటి చీటింగ్‌ మరొకటి బయట పడింది. పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మ ఫౌండేషన్‌ పేరుతో మోసానికి పాల్పడ్డాడు తిరుపతి అనే వ్యక్తి. 18 మంది యువతులకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. ఒక్కో యువతి నుంచి 25 వేలు తీసుకున్నాడు. అయితే మోసపోయామని తెలుసుకుని మంచిర్యాల పోలీసులకు ఆశ్రయించారు బాధితులు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌, ఉట్నూరు, ఇచ్చోడకు చెందిన గిరిజన నిరుద్యోగ యువతులను మోసం చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇటు చిత్తూరు జిల్లాలో కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్స్‌ పేరుతో చీటింగ్‌కు పాల్పడ్డాడు ఓ ఘరానా మోసగాడు. బెట్టింగ్ యాప్ ల ద్వారా అన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలిప్పీన్స్ దేశం కేంద్రంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రచారం కల్పించి యాప్ లోకి యాక్సెస్ కల్పిస్తూ చీటింగ్‌ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

చిత్తూరు జిల్లా వి.కోట, బంగారుపాలెంలో దీనిపై 3 కేసులు నమోదయ్యాయి. వీకోట కు చెందిన మానస అనే యువతి నుంచి 1 లక్ష 15 వేలు, చిత్తూరుకు చెందిన హర్షిత నుంచి 87 వేలు, చిత్తూరుకు చెందిన హేమలత నుంచి 3 లక్షల 10 వేల రూపాయలు వసూలు చేశారు చీటర్స్‌. అయితే బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.

ఈ కేసులో కీలక సూత్రధారి ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్న గుంటూరు జిల్లా తాడికొండ కు చెందిన బొబ్బిలి నవకిషోర్ గా గుర్తించారు చిత్తూరు సిసిఎస్ పోలీసులు. మెడికో గా ఉన్న నవకిషోర్ బెట్టింగ్ యాప్ లను తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ వర్క్ ఫ్రం హోం జాబ్ లో చేరే విదంగా ప్రచారం కల్పించి మోసానికి పాల్పడుతున్నాడని గుర్తించారు పోలీసులు. తన దగ్గర ఉన్న www.myntra678.com, అమెజాన్ వంటి RPK URL లింక్స్ పంపి క్లిక్ చేయమని ప్రోత్సహించి మోసాలకు తెర తీశాడు నవకిశోర్‌.

క్లిక్ చేసిన వెంటనే యాప్ లోకి యాక్సెస్ అయిన వారిని పది రూపాయల నుంచి 500 రూపాయల వరకు బెట్టింగ్ ఆడించి వారికి లాభం వచ్చే వరకు లాగి ఆ తర్వాత అసలు మోసానికి తెరతీసేవాడు నవకిశోర్‌.  మోసపోయి బెట్టింగ్ ఆడే వాళ్ళకి నమ్మకం కలిగించిన తర్వాత గెలిచిన నగదును డ్రా చేసుకొనే అవకాశం లేకుండా సాంకేతిక కారణాలు చెప్పి బ్లాక్ చేసేవాడు. దీంతో లక్షల్లో మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు భాదితులు.

ఇండియాలో తనకు కావలసిన సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్లను ఫిలీపిన్స్ లో పైలట్ ట్రైనింగ్ లో ఉన్న ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శివ కేశవ్ అనే వ్యక్తి ద్వారా తెప్పించుకున్నాడు నవకిషోర్. రాగాల కృష్ణచైతన్య ,బచ్చు కిరణ్, వరస శివప్రసాద్ తో కలిసి చీరాలలో షీల్ టైల్ ఇన్ఫో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కార్యాలయాన్ని ప్రారంభించి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. గ్రామీణ ప్రాంతంల్లోని వారిని ప్రభుత్వం నగదు బదిలీ చేస్తుందని నమ్మించి వారి వద్ద నుంచి ఆధార్ కార్డులు సేకరించి బ్యాంక్ అకౌంట్ ను ప్రారంభించింది ముఠా.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లో 100కు పైగా బ్యాంక్ అకౌంట్ లను తెరిపించి కేరళ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ల నుండి సిమ్ కార్డులను సేకరించి నవ కిషోర్ కి అందజేసినట్లు విచారణ లో తేల్చారు పోలీసులు. ఈ కేసులో శివ కేశవ్, రాగాల కృష్ణ చైతన్య, బచ్చు కిరణ్, వరస శివప్రసాద్‌ లను అరెస్టు చేశారు చిత్తూరు సిసిఎస్ పోలీసులు.

ఇవి కూడా చదవండి: Sharia Law: షరియా చట్టం అంటే ఏంటి? తాలిబన్లు అమలు చేసే ఈ చట్టంలో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

Afghanistan crisis: ఆ విమానంలో నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు!

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..