Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharia Law: షరియా చట్టం అంటే ఏంటి? తాలిబన్లు అమలు చేసే ఈ చట్టంలో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

ఆఫ్గానిస్థాన్‌‌లో కొలువుదీరనున్న తాలిబన్ల రాజ్యంలో ప్రజాస్వామ్యానికి తావు ఉండదు. అక్కడ షరియా చట్టం ప్రకారం మాత్రమే పాలన సాగుతుంది.

Sharia Law: షరియా చట్టం అంటే ఏంటి? తాలిబన్లు అమలు చేసే ఈ చట్టంలో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?
Talibans
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 19, 2021 | 6:43 PM

Taliban – Sharia Law: ఆఫ్గానిస్థాన్‌‌లో కొలువుదీరనున్న తాలిబన్ల రాజ్యంలో ప్రజాస్వామ్యానికి తావు ఉండదు. అక్కడ షరియా చట్టం ప్రకారం మాత్రమే పాలన సాగుతుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే తాలిబన్‌ ప్రతినిధి వహిబుల్లా హషీమీ ప్రకటించారు. మహిళలకు స్వేచ్ఛను ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్న తాలిబన్లు.. అయితే ఇది షరియా చట్టానికి లోబడే జరుగుతుందని చెబుతున్నారు.  ఇంతకీ షరియా చట్టం అంటే ఏమిటి? షరియా చట్టాలంటే మహిళలు ఎందుకు అంతలా భయపడుతున్నారు? షరియా చట్టం మేరకు ఏ నేరానికి ఎలాంటి శిక్ష ఉంటుంది?  పూర్తి వివరాలు చూద్దాం.

ఇస్లాంలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి 1. భగవంతుడు, మానవుల సృష్టి, మరణానంతరం జరిగే పరిణామాలు 2. ప్రార్థన, ఉపవాసాలు, దానాలు, యాత్రలు మొదలైనవి 3. మూడవది చట్టం (షరియా) షరియా అంటే మార్గం అని అర్ధం. ఇది అరబ్బీ పదం నుంచి ఉద్భవించింది.

ఇస్లాం ప్రకారం షరియా చట్టం అంటే…? షరియా చట్టం అనేది ఇస్లామిక్ చట్టానికి మరో పేరు అని భావిస్తుంటారు. కానీ ఇది రాతపూర్వక నియమావళి కాదు. షరియా అనేది పలు మూలాల నుంచి రూపొందించిన ఒక సూత్రాల సమూహం. ముఖ్యంగా ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని అంశాలతో కూడినది ఇది. సున్నాహ్ లోని మహ్మద్ ప్రవక్త జీవితం, బోధనలు, అభ్యాసాల ఆధారంగా షరియా చట్టాన్ని రూపొందించారు. మతాన్ని ఎలా ఆచరించాలి.. ప్రవర్తనా నియమాలు ఏంటి..? చట్టపరమైన విషయాలను ఎలా ఆచరించాలి? వంటి విషయాలు ఇందులో ఉంటాయి. అలాగే దొంగతనం, అత్యాచారం, హత్యల్లాంటి నేరాలకు విధించే శిక్షలు.. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులను నిర్దేశించే కుటుంబ చట్టాలకు సంబంధించిన అంశాలూ షరియా చట్టంలో ఉంటాయి. ఇస్లాంలో ఉన్న ఈ చట్టాలన్నింటినీ కలిపే షరియా అని అంటారు.

Afghanistan Taliban

Afghanistan Taliban

షరియా ప్రకారం చేయాల్సినవి… ప్రార్ధన… ముస్లింలందరూ రోజుకు అయిదు సార్లు ప్రార్ధన చేయాలి అయితే, ప్రార్ధన చేయనందుకు ఖురాన్ లో గానీ, సున్నాహ్ లో గానీ ఎటువంటి శిక్షలు లేవు.

విద్య… ముస్లింలు తమకిష్టమైన విద్యనభ్యసించవచ్చు. ఆసక్తి ఉన్న కళల్లో నైపుణ్యం సంపాదించవచ్చు.

ఆహారం… అన్ని కాయగూరలూ, కోడిగుడ్లు, మాంసం, సముద్ర ఆహార ఉత్పత్తులు తినడానికి ఆమోదయోగ్యమైనవే.  అయితే, జంతు మాంసం తినేటప్పుడు మాత్రం ముస్లింలు ఆ మాంసం హలాల్ చేసిందా కాదా అని చూసుకోవాలి. హలాల్ అంటే ఆమోదం పొందినది అని అర్ధం.

బ్రహ్మచర్యం... ఇస్లాం ననుసరించి ముస్లింలు బ్రహ్మచర్యాన్ని పాటించడం, సన్యసించడం నిషేధం

వివాహం… నిఖా తప్పనిసరి. ఇది జరగని పక్షంలో వివాహానికి ఇస్లాంలో చట్టబద్ధత ఉండదు.

విందులు… ముస్లింలు నిరభ్యంతరంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పార్టీలకు హాజరు కావచ్చు. పార్టీల్లో పొగ తాగడం, మద్యపానం సేవించడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. పార్టీలకు వెళ్ళినప్పుడు పురుషులు ఇతర కుటుంబాలకు సంబంధించిన మహిళలతో మాట్లాడకూడదు. తమ సొంత కుటుంబంలోని మహిళలతో మాత్రమే మాట్లాడాలి. మహిళలు శరీరమంతా కప్పే వస్త్రాలు ధరించాలి. మహిళలు, హిజాబ్ లేదా బుర్ఖా ధరించాలి.

నేరం… శిక్ష… షరియా చట్టం నేరాలను హద్ నేరాలు (కఠినమైన శిక్షలుండే తీవ్రమైన నేరాలు),  తాజిర్ నేరాలని (న్యాయాధిపతి నిర్ణయం మేరకు విధించే శిక్ష) రెండు రకాలు ఉంటాయి. దొంగతనం, వ్యభిచారం హద్ నేరాల జాబితాలోకి వస్తాయి. దీనికి చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలుంటాయి. మతమార్పిడిని ముస్లింలు నేరంగా పరిగణిస్తారు. షరియా చట్టం ప్రకారం ఈ నేరానికి మరణశిక్షే. అయితే చాలా ఇస్లామిక్ దేశాలు షరియా చట్టం ప్రకారం శిక్షలను విధించవు.

Talibans

Talibans

తాలిబన్లు చెప్పే షరియా చట్టాల ప్రకారం… తాలిబన్లు చట్టాల ప్రకారం స్త్రీలకి బురఖాలు, పురుషులకి గడ్డాలు తప్పనిసరి. పదేళ్ళు పై బడిన వారు బాలికలు ఎవ్వరు కూడా బడులకి వెళ్ళకూడదు (నిజానికి ఖురాన్ లో, ఇస్లాంలో మహిళా విద్యపై ఆంక్షలేమీ లేవు). అంతేకాకుండా సంగీతం, టీవీ, సినిమాలు నిషేధం ఉంటుంది. మహిళలు బయటకు వెళ్ళాలంటే మగవారి తోడు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడ ఏ విద్య అయిన ఇస్లామిక్ షరియా చట్టాలకి లోబడి ఉండాలి. ప్రతి శుక్రవారం ప్రజలు చేసుకునే పార్టీలు అక్కడ నిషిద్దం. త‌ప్పు చేసిన వారికి ష‌రియా చ‌ట్టం ప్రకారం శిక్షలు విధిస్తుంటారు.

తాలిబన్లు విధించే ఈ శిక్షలు చాలా క‌ఠినంగా ఉంటాయి. హంతకులను, అక్రమ సంబంధానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న స్త్రీ పురుషులను బహిరంగంగా తలలు నరకడం లేదా ఉరితీయడం వంటివి చేస్తారు. దొంగతనాలకి పాల్పడితే కాళ్ళు చేతులు నరుకుతారు. వ్యభిచారం లేదా వ్యభిచారంలో పాల్గొన్న వ్యక్తులకి తప్పనిసరిగా 100 కోరాడ దెబ్బలు ఉంటాయి. ఇక అవివాహితులైతే వారిని ఏడాది పాటు బహిష్కరణ లేదా వివాహం చేసుకుంటే రాళ్లతో కొట్టి చంపుతారు.

అందుకే ఆఫ్గనిస్థాన్ ప్రజలు అక్కడ కొత్తగా కొలువుదీరుతున్న తాలిబన్లను చూసి పారిపోవడం లేదు..వారు అమలు చేయనున్న అత్యంత కఠినమైన షరియా చట్టాలను చూసి పారిపోతున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

(With Inputs of Research Desk, TV9 Telugu)

Also Read..

భోజనంలో మత్తు మందు కలిపి భర్తకు కరెంట్​ షాక్​.. ఆ తర్వాత సీన్ రివర్స్

జూబ్లీహిల్స్‌లో ఫేక్ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్.. ఈ నకిలీ దందా లోతుల్లోకి వెళితే..