AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భోజనంలో మత్తు మందు కలిపి భర్తకు కరెంట్​ షాక్​.. ఆ తర్వాత సీన్ రివర్స్

ప్రస్తుతం వివాహా బంధాలు ఎలా మారాయో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న, చిన్న అలకలు అన్నీ చోట్లా ఉంటాయి.. కానీ ప్రస్తుతం వేధింపులు, వివాహేతర...

Crime News: భోజనంలో మత్తు మందు కలిపి భర్తకు కరెంట్​ షాక్​.. ఆ తర్వాత సీన్ రివర్స్
Current Shock
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2021 | 6:04 PM

Share

ప్రస్తుతం వివాహా బంధాలు ఎలా మారాయో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న, చిన్న అలకలు అన్నీ చోట్లా ఉంటాయి.. కానీ ప్రస్తుతం వేధింపులు, వివాహేతర సంబంధాలు, హత్యాయత్నాలు, హత్యలు వరకు వెళ్లాయి కాపురాలు. కలహాలు కారణంగా క్షణికావేశంలో దాంపత్య జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్​ చురు జిల్లాలో జరిగింది. భర్త వేధింపులు తాళలేక ఓ భార్య.. అతనికి కరెంట్​ షాక్​ ఇచ్చి హత్యాయత్నం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుడు ప్రస్తుతం జిల్లాలోని బికనేర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆగస్టు 12న సాయంత్రం బాధితుడు మహేంద్ర దాన్​(32) పనికి వెళ్లి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత భార్య సుమన భర్తకు భోజనం వడ్డించింది. ఈ క్రమంలోనే మహేంద్ర కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతని చేతులను పాలిథిన్​ కవర్లు, కాళ్లను విద్యుత్తు తీగలతో కట్టేసింది భార్య. ఆ తర్వాత కరెంట్​ షాక్​ ఇచ్చింది. దాంతో అతనికి మెలుకువ వచ్చింది. భయపడిన సుమన.. వెంటనే డ్రామా షురూ చేసింది. ఇరుగుపొరుగువారిని పిలిచి, తన భార్తకు కరెంట్ షాక్​ కొట్టిందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని నాటకాన్ని రక్తి కట్టించింది. స్థానికుల సాయంతో అదే రాత్రి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి బికనేర్​ జిల్లా పీబీఎం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహేంద్ర దాన్ తనకు పూర్తిగా తెలివి వచ్చిన తర్వాత బంధువులకు విషయం చెప్పాడు. బాధితుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మహిళపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి హిమ్మత్​ సింగ్​ తెలిపారు. ​బాధితుడు, అతని తండ్రి వాంగ్మూలాలు నమోదు చేశామని, దర్యాప్తు చేపట్టామన్నారు. అయితే.. ఇప్పటి వరకు సుమనను అరెస్ట్​ చేయలేదని చెప్పారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఏకంగా మత్తు మందు చిత్తు భార్య, భర్తను చంపడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసి.. చుట్టుప్రక్కల వారు నివ్వెరపోతున్నారు.

Also Read:  వాట్సాప్‌లో తెలిసినవారి నుంచి వచ్చిన లింక్స్ క్లిక్ చేసినా అంతా ఖల్లాస్.. తస్మాత్ జాగ్రత్త

 కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు జగన్ సర్కార్ ఆపన్న హస్తం.. కీలక ఆదేశాలు