ఆఫ్ఘన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆఫ్ఘన్ల భారీ ర్యాలీలు, తాలిబన్ల కాల్పులు.. పలువురి మృతి

ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం తాలిబన్లను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారు. ' మా జాతీయ జెండా.. మా ఐడెంటిటీ' అని నినాదాలు చేస్తూ పురుషులు, మహిళలు సైతం వీటిలో పాల్గొన్నారు.

ఆఫ్ఘన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆఫ్ఘన్ల భారీ ర్యాలీలు, తాలిబన్ల కాల్పులు.. పలువురి మృతి
People Wave Afghan Flags
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 19, 2021 | 6:11 PM

ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం తాలిబన్లను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారు. ‘ మా జాతీయ జెండా.. మా ఐడెంటిటీ’ అని నినాదాలు చేస్తూ పురుషులు, మహిళలు సైతం వీటిలో పాల్గొన్నారు.1919 లో బ్రిటిష్ వారి అధీనం నుంచి ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్య్రం పొందింది.. కునార్ ప్రావిన్స్ రాజధాని అసాదాబాద్ లో జరిగిన ర్యాలీపై తాలిబన్లు కాల్పులు జరిపారని, అయితే ఇదే సందర్బంలో తొక్కిసలాట కూడా జరగడంతో అనేకమంది మరణించడమో గాయపడడమో జరిగిందని తెలుస్తోంది. తాలిబన్ల కాల్పుల్లో వీరు మరణించారా లేక తొక్కిసలాటలోనా అన్నది స్పష్టంగా తెలియలేదు.జలాలాబాద్ లో కూడా పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆఫ్ఘన్ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. తాలిబాన్లపై [పోరును సమర్థిస్తున్న ఆఫ్ఘన్ తొలి మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలెహ్..ఈ నిరసనలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. జాతీయ పతాకాలను చేతబట్టి దేశ గౌరవం కోసం ధైర్యంగా నిలబడినవారికి నా సెల్యూట్ అని ఆయన ట్వీట్ చేశారు. తాను ఆఫ్ఘన్ లోనే ఉన్నానని, అష్రాఫ్ ఘని నిష్క్రమించాక తానే ఆపద్ధర్మ అధ్యక్షుడినని ఆయన ప్రకటించుకున్నారు.

మరోవైపు తాలిబాన్లపై తాము జరుపుతున్న పోరాటానికి పశ్చిమ దేశాలు మద్దతు నివ్వాలని నేషనల్ రెసిస్టెంట్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అమద్ మసూద్ కోరారు. 2001 లో ఈయన తండ్రిని తాలిబన్లు కాల్చి చంపారు. ఇలా ఉండగా కాబూల్ లో జర్నలిస్తులపై కూడా తాలిబన్లు దాడులు జరుపుతున్నారు. నిరసనలను కవర్ చేస్తున్న వీరిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. వీరి దాడుల్లో ఓ జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: ‘అక్కడా ఓ దళిత బంధు’.. ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో వారికి ఇళ్ళు కట్టిస్తామన్న యూపీ సీఎం

Crime News: భోజనంలో మత్తు మందు కలిపి భర్తకు కరెంట్​ షాక్​.. ఆ తర్వాత సీన్ రివర్స్