AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghan Crisis: విదేశాల్లో శిక్షణ తీసుకున్న సైన్యాన్ని, పైలెట్లను విధుల్లోకి చేరమంటున్న తాలిబన్లు.. ప్రపంచ దేశాల్లో ఆందోళన

No Democracy in Afghan: తాలిబన్ల నీడలోకి చేరుకున్న అఫ్గనిస్థాన్‌లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పేరు మార్చుకున్న ఆఫ్గనిస్తాన్ తాజాగా..

Afghan Crisis: విదేశాల్లో శిక్షణ తీసుకున్న సైన్యాన్ని, పైలెట్లను విధుల్లోకి చేరమంటున్న తాలిబన్లు.. ప్రపంచ దేశాల్లో ఆందోళన
Afghanistan
Surya Kala
|

Updated on: Aug 19, 2021 | 3:28 PM

Share

No Democracy in Afghan: తాలిబన్ల నీడలోకి చేరుకున్న అఫ్గనిస్థాన్‌లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పేరు మార్చుకున్న ఆఫ్గనిస్తాన్ తాజాగా పరిపాలనా విధానాన్ని కూడా మార్చుకుంది. ఈ మేరకు తాలిబన్లు ఇకపై తమ దేశంలో ప్రజస్వామ్యం ఉండదని స్పష్టం చేశారు. తమ దేశాన్ని ఓ కౌన్సిల్‌ ద్వారా పరిపాలించనున్నామని ప్రకటించారు. తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హోదాలో హైబతుల్లా అఖుండ్‌జాదా వ్యవహరిస్తారని ఆ సంస్థ ప్రతినిధి వహిబుల్లా హషీమీ ఓ ఆంగ్ల వార్త సంస్థకు తెలిపారు. అంతేకాదు తాము ఇప్పటికే పరిపాలనా పరమైన నిర్ణయాలను తీసుకున్నామని.. అఫ్గాన్‌ పైలట్లు, సైనికులతో సంప్రదించి వారిని విధుల్లో చేరాలని కోరినట్లు తెలిపారు.

అయితే ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల కౌన్సిల్ పరిపాలన కొత్తేమీ కాదు.. గతంలో కూడా అంటే 1996 నుంచి 2001 వరకూ తాలిబన్ల చీఫ్‌గా ముల్లా ఒమర్‌ వ్యవహరించారు. ఒమర్ అజ్ఞాతంలో ఉన్న సమయంలో పాలన కౌన్సిల్ చేసేది.  ఇప్పుడు కూడా అఖుండ్‌జాదా కౌన్సిల్ లో చీఫ్ గా ఉన్నా పరిపాలన కౌన్సిల్ లోని వ్యక్తులు చేస్తారు.

అంటే అఖుండ్‌జాదా కింద మౌల్వీ యాకూబ్‌, సిరాజుద్దీన్‌ హక్కానీ, అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఉన్నారు.  ఇక పరిపాలన కు సంబందించిన అంశాలపై తాలిబన్లు ఓ నిర్ణయానికి రాలేదని వహిబుల్లా హషీమీ తెలిపారు. షరియా చట్టం అమలు ఉంటుదని వెల్లడించారు.

అంతేకాదు గత ప్రభుత్వ, తాలిబన్‌ బలగాలను కలిపి ఓ సైన్యంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. అఫ్గాన్‌ సైన్యంలో విదేశాల్లో శిక్షణ పొందిన వారు ఉండటంతో వారిని విధుల్లోకి తీసుకోనున్నామని చెప్పారు. అయితే సైన్యంలో సంస్కరణలు చేయాల్సి ఉందని.. కానీ, వారు తమకు అవసరమని హషీమీ వెల్లడించారు. ఇక తాము స్వాధీనం చేసుకొన్న విమానాలు, హెలికాప్టర్ల కోసం పైలట్ల అవసరం ఉందని తెలిపారు. అందుకనే ఆఫ్గాన్సం ఫైలెట్లను సంప్రదిస్తున్నామని.. వారిని తిరిగి విధుల్లోకి చేరమని కోరుతున్నామని తెలిపారు.

ఉజ్బెకిస్థాన్‌లో 8ఉన్న తమ 22 విమానాలు, 24 హెలికాప్టర్లను తిరిగి ఇవ్వమని కోరుతున్నామని చెప్పారు. అమెరికా ఇచ్చిన డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను పొరుగున ఉన్న ఉజ్బెకిస్థాన్‌లోని తర్మీజ్‌ ఎయిర్‌ పోర్టుకు తరలించారు. వీటిల్లో ఏ-29 సూపర్‌ టూకోన్‌ యుద్ధవిమానాలు 22 వరకు ఉన్నాయి

అయితే విదేశాల్లో శిక్షణ పొందిన సైన్యం, పైలెట్ల తాలిబన్ల కోరికతో చేరితే.. పరిస్థితి ఎలా పరిణమిస్తుందోనని చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అమెరికాలోని ట్విన్‌ టవర్లపై విమానాలతో దాడికి తాలిబన్లు ఆశ్రయం ఇచ్చిన అల్‌ ఖైదా ఉగ్రమూకే కారణం. దీంతో తాలిబన్ల దగ్గరకు శిక్షణ పొందిన పైలట్లు  చేరితే వారిని ఎలా వినియోగించుకొంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది అంటూ గతాన్ని గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Pulagam Recipe: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. కొత్తబియ్యంతో పులగం తయారీ విధానం..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..