- Telugu News Photo Gallery World photos International reporter clarrissa ward wearing islamic dress in kabul after taliban attack photos goes viral
ఆఫ్ఘనిస్తాన్లో మారిన మహిళల దుస్తుల అలంకరణ.. ప్రస్తుత పరిస్థితికి అద్ధం పడుతున్న రిపోర్టర్ ఫోటోలు..
ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం.. అక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతున్నారు. తాలిబన్లు అధికారం చేపడితే ముఖ్యంగా మహిళలు సర్వ హక్కులు కోల్పోతారు. పూర్తిగా వారి జీవన విధానం మారిపోతుంది. అయితే ఇప్పుడు వారి దుస్తుల అలంకరణ పూర్తిగా మారిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Updated on: Aug 19, 2021 | 2:01 PM

CNN టీవీ రిపోర్టర్ క్లారిస్సా వార్డ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె వస్త్రాధారణ పూర్తిగా మారిపోయింది. తాలిబన్ల పాలలో వార్డ్ ఇస్లామిక్ దుస్తులను ధరించి కనిపించింది.

అయితే గతంలో ఆమె ఉన్న ఫోటోలు, ప్రస్తుతం ఆమె కనిపిస్తున్న ఫోటోలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారాయి. తాలిబన్ల పాలనలో మహిళలు ఎలా ఉండబోతున్నారనేది దానికి నిదర్శంగా మారాయి.

గతంలోని ఫోటోలో ఆమె సాధారణ దుస్తులతో కనిపించగా.. ప్రస్తుతం ఇస్లామిక్ దుస్తులు ధరించింది. ఆమె హిజాబ్ ధరించింది. కేవలం ముఖం మాత్రమే కనిపిస్తూ.. కాళ్ల నుంచి మెడ వరకు చర్మం కనిపించకూడదు. వీటిని షియా మహిళలు ధరిస్తారు.

అయితే దీనిపై వార్డ్ స్పందిస్తూ.. తను కాబూల్ వెళ్లినప్పుడల్లా బుర్ఖా ధరిస్తానని.. కానీ ఇప్పుడు తాలిబన్ల పాలన ఉండడంతో కాబూల్ వీధులలో తిరగడానికి తను ఈ దుస్తులు ధరించినట్లుగా తెలిపింది

క్లారిస్సా వార్డ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం ద్వారా ప్రభావితమైన అనేక దేశాలను సందర్శించిన నిర్భయ రిపోర్టర్‌గా గుర్తింపు పొందింది. 2012లో ఆమె సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం సమయంలో కూడా రిపోర్టింగ్ చేసింది.

క్లారిస్సా వార్డ్ 2019 సంవత్సరంలో తాలిబాన్ పాలిత ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల జీవితాలను చూపించింది. అలా చేసిన మొదటి పాశ్చాత్య రిపోర్టర్ ఆమె. అలాగే ఆమె తాలిబాన్ నాయకులను కూడా అనేకసార్లు ఇంటర్వ్యూలు చేసింది.

ఆఫ్ఘనిస్తాన్లో మారిన మహిళల దుస్తుల అలంకరణ..





























