AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koganti Satyam: విజయవాడ రాహుల్ హత్య కేసు.. పోలీసుల విచారణలో అసలు విషయాలు తెలుస్తాయన్న కోగంటి సత్యం

 యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో కోగంటి సత్యం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ కోగంటి సత్యం ఎవరో తెలుసుకుందాం పదండి...

Koganti Satyam: విజయవాడ రాహుల్ హత్య కేసు.. పోలీసుల విచారణలో అసలు విషయాలు తెలుస్తాయన్న కోగంటి సత్యం
Koganti Satyam
TV9 Telugu Digital Desk
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 20, 2021 | 4:32 PM

Share

యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో కోగంటి సత్యం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ కోగంటి సత్యం ఎవరో తెలుసుకుందాం పదండి. కోగంటి సత్యం పేరు చెబితే బెజవాడ ప్రజలు గజగజ వణికిపోతారు. అంతటి క్రైమ్ హిస్టరీ ఉంది అతడికి. క్రైమ్ కు కేరాఫ్ అడ్రస్ కోగంటి సత్యం. పేరుకు బెజవాడ రౌడీషీటర్… కానీ, ఇతనికి ఈ పదం సరిపోదు. అంతకంటే పెద్ద పదం వాడితేనే కరెక్ట్. ఎందుకంటే, అతనికున్న క్రైమ్ హిస్టరీ ఆ రేంజ్ లో ఉంది మరి. గొడవలు, దాడులు, మోసాలు, కిడ్నాప్ లు, భూకబ్జాలు, మర్డర్లు ఇలా చెప్పుకుంటూపోతే అతను చేయని నేరమంటూ లేదు. పాత సీసాలు కొనే స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తిన కోగంటి నేర చరిత్ర అంతా ఇంతాకాదు. బెజవాడ కృష్ణలంక ఇతని అడ్డా. బెజవాడ వాసులంతా కోగంటి దొడ్డి అంటారు. ఎన్నో ఘోరాలు, నేరాలు, అక్రమాలకు అడ్డా ఈ కోగంటి దొడ్డి. ఎవరినైనా అడ్డుతొలగించుకోవాలంటే ఈ కోగంటి దొడ్డికి వెళ్తే చాలంటారు. కోగంటి సెటిల్ మెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలంటే అతనిపై నమోదైన కేసులను చూస్తే తెలుస్తుంది. విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ కోగంటిపై కేసులు ఉన్నాయి. పోలీసుల రికార్డ్స్ ప్రకారం ఒక్క విజయవాడలోనే కోగంటిపై 30కి పైగా కేసులు ఉన్నట్టు తేలింది.

కోగంటి సత్యనారాయణ అలియాస్ కోగంటి సత్యం. క్రైమ్‌కే కాదు కన్నింగ్ కూ కోగంటి కేరాఫ్ అడ్రస్. నమ్మించి గొంతు కోసేస్తాడు. కష్టపడి పైకొచ్చిన వాళ్లుంటారు… మోసంచేసి పైకొచ్చిన వాళ్లుంటారు. కానీ నేను మూడో రకం. ఇది ఓ సినిమాలో డైలాగ్. ఈ డైలాగ్ కోగంటి సత్యానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే, కోగంటి సత్యం అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ పైకొచ్చిన రకం. తనకు అడ్డొచ్చిన వాళ్లను తొలగించుకోవడంలో అతనికి అతనే సాటి. చూడ్డానికి షార్ట్‌ గా ఉంటాడు. చాలా సాదాసీదాగా కనిపిస్తాడు. చాలా సాఫ్ట్ గా కూల్ గా ఉంటాడు… కానీ అతను చేసే పనులే యమా వయెలెంట్ గా ఉంటాయ్.

బడా బిజినెస్ మ్యాన్స్ నుంచి సినీ నటుల వరకూ అందరూ కోగంటి బాధితులే. కోగంటి క్రైమ్ హిస్టరీని ఒకసారి తెలుసుకుందాం పదండి. ఆమధ్య హైదరాబాద్ లో జరిగిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసులో కోగంటి పేరు మారుమోగింది. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా కోగంటి ఉన్నారు. సినీ నటి వహీదా రెహ్మాన్ కూడా కోగంటి వదల్లేదంటే అతను ఏ రేంజ్ లో సెటిల్మెంట్స్ చేస్తాడో అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ బెంజి సర్కిల్ లో కోట్ల విలువైన భూమి నేటికీ కోగంటి కబంధ హస్తాల్లోనే ఉందని చెబుతారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బిషప్ భగవాన్ దాస్ మర్డర్ కేసులోనూ కోగంటి సత్యమే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2008లో కాట్రగడ్డ బాబుపై కాల్పులు జరిపించాడంటూ కోగంటిపై కేసు నమోదైంది. 2010లో కోగంటిపై కోకా యాక్ట్ కింద కేసు నమోదవడంతో నగర బహిష్కరణ కూడా విధించారు పోలీసులు. భూవివాదంలో బోండా ఉమ, కోగంటి మధ్య జరిగిన గొడవల్లోనూ అతనిపై కేసు నమోదైంది. ఇలా చెప్పుకుంటూపోతే కోగంటిపై పదుల సంఖ్యలో కేసులున్నాయ్. ఇక, రికార్డుల్లోకి ఎక్కని కేసులు కోకొల్లలు.

1985లో అప్పటి మంగళగరి సర్పంచ్ మర్డర్ తో కోగంటి నేర చరిత్ర మొదలైందని చెబుతారు. అక్కడ్నుంచి విజయవాడ కృష్ణలంకకు మకాం మార్చిన కోగంటి.. భూకబ్జాలు, సెటిల్మెంట్లతో కోట్లకు పడగలెత్తాడు. ఎస్డీవీ స్టీల్స్ కంపెనీని ప్రారంభించి అదే అడ్డాగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వంగవీటి రంగా హత్య తర్వాత మరింత రెచ్చిపోయాడు. కాట్రగడ్డ ప్లాన్ చేస్తే బతికి బయటపడటం అసాధ్యమంటారు. కోగంటి సత్యంపైనా అనేకసార్లు హత్యాప్రయత్నం జరిగినా తప్పించుకున్నాడు. కోగంటిపై స్పైపర్ గన్ తో కాల్పులు జరిగాయ్, కానీ తప్పించుకున్నాడు. ఓ ఫంక్షన్లోనూ అటాక్ జరిగితే సేఫ్ గా బయటపడ్డాడు. రెండోసారి జరిగిన కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. ఐతే రాహుల్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి చెబుతున్నారు. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. రాహుల్ కంపెనీ రెండేళ్ల కంపెనీ కొందామనుకున్నానని, కానీ రేటు ఎక్కువ చెప్పడంతో విరమించుకున్నట్లు చెప్పారు. ఏదైనా విషయం తన వద్దకు వస్తే.. సెటిల్ చేసి గొడవను సర్దుబాటు చేసేవాడిని తప్ప ఇంతదూరం రానివ్వచ్చేవాడిని కాదని కోగంటి సత్యం చెప్పారు.

Also Read:సూపర్ హిట్ నవల ‘కొండపొలం’ స్టోరీతో వైష్ణవ్ తేజ్, క్రిష్ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్

2025 కల్లా కొత్త బస్సుల్లో 10 శాతం విద్యుత్‌వే.. రేటింగ్స్‌ సంస్థ ఇక్రా వెల్లడి