AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్నేహితురాలి సోదరుడిపై కన్నేసిన యువతి.. అసలు విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు..

Telangana: రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం చేసుకుంది. ప్రేమ పేరుతో కిలాడీ యువతి చేసిన ఘరానా మోసానికి ఓ యువకుడు బలైపోయాడు. వివరాల్లోకెళితే..

Telangana: స్నేహితురాలి సోదరుడిపై కన్నేసిన యువతి.. అసలు విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు..
Shiva Prajapati
|

Updated on: Aug 20, 2021 | 1:25 PM

Share

Telangana: రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం చేసుకుంది. ప్రేమ పేరుతో కిలాడీ యువతి చేసిన ఘరానా మోసానికి ఓ యువకుడు బలైపోయాడు. వివరాల్లోకెళితే.. వరంగల్ జిల్లాలోని మొరిపిరాలకు చెందిన మైలపాక సందీప్ కుమార్.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసేశాడు. అతనికి ఓ సోదరి ఉండగా.. ఆమెకు బీటెక్ చదువుతున్న ఓ స్నేహితురాలు ఉంది. ఈ బీటెక్ అమ్మాయి.. ఆ యువతి సోదరుడిపై కన్నేసింది. ముగ్గురు యువతల పేర్లతో.. మూడు సెల్ ఫోన్ నెంబర్లతో యువకుడికి ఎర వేసింది. ప్రేమ పేరుతో యువకుడి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజింది. ఈ క్రమంలో ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని భావించిన యువతి.. కొత్త ఎత్తుగడ వేసింది.

రెగ్యూలర్‌గా మాట్లాడే యువతి.. ఆత్మహత్య చేసుకుందని బాధితుడిని బెదిరించి డబ్బులు వసూలు చేసింది. అయితే చివరికి విషయం తెలిసిన యువకుడు మోసపోయాని గుర్తించి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగాడు వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు.. ఎంజీఎంలో చేర్పించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. సందీప్ కుమార్ మృతిపై అతని తల్లిదండ్రులు రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు.. యువకుడి ఆత్మహత్యకు కారణమైన యువతిని గుర్తించారు. మృతుడి సోదరితో కలిసి చదవిన దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన యువతే సూత్రధాని అని తేల్చారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా, పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

Also read:

Systematic Investment Plan: నెలకు రూ.15వేలతో రూ.10 లక్షలు సంపాదించవచ్చు..!

Koganti Satyam: విజయవాడ రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం పేరు.. అతడి నేరాలు, ఘోరాలు తెలిస్తే షాకే

Anganwadi Jobs: టెన్త్ పాసై.. ఉద్యోగం కోసం చూస్తున్న వివాహిత మహిళలకు గుడ్ న్యూస్.. 288 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్