Systematic Investment Plan: నెలకు రూ.15 వేల పెట్టుబడితో కోట్లల్లో లాభం.. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎంతో ప్రయోజనం!
Systematic Investment Plan: ప్రస్తుతం కొత్తగా సంపాదిస్తున్న వారికి పెట్టుబడి పెట్టడానికి ఎన్నో రకాల మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్‌లలో..
Systematic Investment Plan: ప్రస్తుతం కొత్తగా సంపాదిస్తున్న వారికి పెట్టుబడి పెట్టడానికి ఎన్నో రకాల మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్‌లలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. తక్కువ మొతాదులో చిన్న చిన్న పెట్టుబడులతో ఎక్కువ లాభం పొందే అవకాశం సిప్ ద్వారానే ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రతి నెల 5 నుంచి 10 వేలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్‌లో పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువత సిప్ ద్వారానే ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెబుతున్నారు.
ఎవరైతే ఎక్కువ పెట్టుబడులు ఆశిస్తారో వారికి మ్యూచువల్ ఫండ్‌లో సిప్ పెట్టుబడి సరైన వేదిక అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకే సారి పెద్ద పెట్టుబడి పెట్టడం కంటే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవడం వేతన వర్గాలకు ఉపయుక్తంగా ఉంటుంది. సిప్‌లో పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సిప్ అనేది దీర్ఘకాలం పెట్టుబడి పెట్టే వారికి అద్భుతమైన ఆదాయ వనరు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడికి మంచి బెనిఫిట్ పొందవచ్చని పేర్కొంటున్నారు. ఉద్యోగ వర్గాలకు, నిరంతరం ఆదాయం వచ్చే వారికి ప్రస్తుతం మార్కెట్‌లో సిప్‌లో పెట్టుబడి మేలని వివరిస్తున్నారు. 25 సంవత్సరాల వయసులో సరైన ఇన్వెస్ట్ మెంట్ చేస్తే 50 ఏళ్ల వయసుకు వచ్చే సరికి రూ.10 కోట్లు సంపాదించవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
మ్యూచ్‌వల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువలో తక్కువ 12శాతం లాభం పొందవచ్చని, మ్యూచ్‌వల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ప్రకారం 25 ఏళ్ల వయసులో సిప్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా నెలకు రూ.15,000 పెట్టుబడిగా పెడితే 50 ఏళ్లు వచ్చే వరకు సుమారు. రూ.10.19 కోట్లు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో మీరు ఎస్‌ఐపీలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. కాలక్రమేణా సిప్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలకు చేరుకోవచ్చు. ప్రస్తుత తరుణంలో ఎన్నో పెట్టుబడి పెడుతూ మంచి లాభాలు పొందేందుకు ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు.