Afghanistan crisis: ఆ విమానంలో నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు!

Afghanistan crisis: ఆ విమానంలో నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు!
Fall From Plane

 ఇటీవల అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం టైర్ల‌ను ప‌ట్టుకొని వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించి ముగ్గురు వ్య‌క్తులు కింద ప‌డి మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన...

Ram Naramaneni

|

Aug 19, 2021 | 8:59 PM

ఇటీవల అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం టైర్ల‌ను ప‌ట్టుకొని వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించి ముగ్గురు వ్య‌క్తులు కింద ప‌డి మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఎంతో వైర‌ల్ అయింది. ఇది చూసి ప్ర‌పంచ‌మంతా షాక్‌కి గురైంది. అయితే తాజాగా అలా కింద ప‌డిన ముగ్గురిలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఉన్న‌ట్లు ఓ రిపోర్ట్ వెల్ల‌డించింది. తాలిబన్ల నుంచి దూరంగా ఎలాగైనా దేశం వ‌దిలి వెళ్లిపోవాల‌నుకున్నారు. అందుకే విమానంలో ఖాళీ లేక‌.. దాని టైర్ల‌ను పట్టుకొని వేలాడుతూ అయినా దేశ స‌రిహ‌ద్దులు దాటితే చాల‌నుకున్నారు. కానీ ఆ విమానం అలా గాల్లోకి లేచిందో లేదో వాళ్ల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. విమానం నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్ద‌రు తోబుట్టువులు 17 ఏళ్ల రెజా, 16 ఏళ్ల క‌బీర్. వాళ్లు కింద ప‌డుతున్న స‌మ‌యంలో చూసిన వాళ్లు ఆ ఇద్ద‌రి వివ‌రాలు వెల్ల‌డి కావ‌డంలో సాయం చేశారు. ఈ ఇద్ద‌రిలో పెద్ద వాడైన రెజా మృత‌దేహం ఎయిర్‌పోర్ట్‌కు ద‌గ్గ‌ర‌లోని ఓ భ‌వ‌నంపైన ల‌భించింది. అత‌ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు. క‌బీర్ జాడ మాత్రం ఇంకా తెలియ‌లేదు. రెజా కింద‌ప‌డిన‌ప్పుడు అత‌ని కాళ్లు, చేతులూ పూర్తిగా నుజ్జునుజ్జ‌య్యాయి. అత‌న్ని నేనే తీసుకెళ్లి ఖ‌న‌నం చేశాన‌ని ఓ కుటుంబ స‌భ్యుడు తెలిపాడు. అయితే కబీర్ జాడ మాత్రం ఎంత వెతికినా దొర‌క‌లేద‌ని అత‌డు చెప్పాడు.

కెన‌డా లేదా అమెరికాలో 20 వేల మంది ఆఫ్గన్ల‌కు ఆశ్ర‌య‌మిస్తున్న‌ట్లు ఎవ‌రో ఇరుగుపొరుగు మాట్లాడుకుంటే విని ఈ ఇద్ద‌రూ ఎయిర్‌పోర్ట్‌కు ప‌రుగు తీశారు. ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా త‌మ గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లిపోయారు. ఆ కుటుంబంలో మొత్తం 8 మంది సంతానం కాగా.. ఈ ఇద్ద‌రే అంద‌రి కంటే పెద్ద వాళ్లు.

Also Read: ఈ పథకాలతో రైతులకు ఎంతో మేలు.. అస్సలు మిస్ అవ్వకండి… పూర్తి వివరాలు

వాలంటీర్ వద్ద, రేషన్ షాపు వద్ద కూడా ఈ-కేవైసీ.. గడువుపై కూడా పూర్తి క్లారిటీ ఇదిగో

Tv9 Cab

Tv9 Cab

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu