US Capitol: అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌ వద్ద బాంబు కలకలం.. అనుమానాస్పదంగా ఆగివున్న వాహనం. రంగంలోకి పోలీసులు.

US Capitol: అమెరికా కాపిటల్‌ భవనం వద్ద బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. యూఎస్‌ కాపిటల్‌ భవనం, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌ వద్ద అనుమానస్పదంగా ఆగివున్న ఓ ట్రక్కులో...

US Capitol: అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌ వద్ద బాంబు కలకలం.. అనుమానాస్పదంగా ఆగివున్న వాహనం. రంగంలోకి పోలీసులు.
Us
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 19, 2021 | 9:11 PM

US Capitol: అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌  భవనం వద్ద బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. యూఎస్‌ కాపిటల్‌ భవనం, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా కాపిటల్ పోలీసులు అక్కడ పరిసర ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయించారు. ప్రజలను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రక్కులో పేలు పదార్థాలు ఉన్నాయా అన్న దానిపై దృష్టి సారించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయమై యూఎస్‌ కాపిటల్‌ పోలీసులు మాట్లాడుతూ.. లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌కు సమీపంలో అనుమానస్పద వాహనం నిలిపి ఉందన్న వార్తతో వెంటనే స్పందించాం. దీనికి సమీపంలోనే కాపిటల్‌ భవనంతో పాటు సూప్రీం కోర్టు ఉంది. కేనాన్‌ హౌజ్‌ ఆఫీసును కూడా ఖాళీ చేయించామని తెలిపారు. ఇంతకీ ఆ ట్రక్కులో ఏముందో తెలియాలంటే మరికొద్ది సేపు వేచి చూడాలి. ఇదిలా ఉంటే ట్రంప్‌ ఓటమి తర్వాత ఆయన మద్ధతుదారులు అమెరికా కాపిటల్‌ భవనంలో చేసిన హంగామా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఘటన జరిగిన కొన్ని నెలలకే ఇప్పుడు అమెరికా కాపిటల్‌ భవనం మరోసారి వార్తల్లోకెక్కింది.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..