SBI Password Alert: మీరు సైబర్‌ నేరాల బారిన పడకూడదనుకుంటున్నారా.? అయితే మీ పాస్‌వర్డ్‌ను ఇలా సెట్‌ చేసుకోండి.

SBI Password Alert: టెక్నాలజీ ఎంతలా పెరుగుతుందో దానితో పాటు సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. నెట్టింట తిష్ట వేసుకున్న కొందరు సైబర్‌ నేరగాళ్లు...

SBI Password Alert: మీరు సైబర్‌ నేరాల బారిన పడకూడదనుకుంటున్నారా.? అయితే మీ పాస్‌వర్డ్‌ను ఇలా సెట్‌ చేసుకోండి.
Strong Passeord
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 19, 2021 | 8:41 PM

SBI Password Alert: టెక్నాలజీ ఎంతలా పెరుగుతుందో దానితో పాటు సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. నెట్టింట తిష్ట వేసుకున్న కొందరు సైబర్‌ నేరగాళ్లు ఎప్పుడెప్పుడు ఖాతాలోని డబ్బును కొట్టేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మీ పాస్‌వర్డ్‌ ఏమాత్రం వీక్‌గా ఉన్నా ఇక మీ పని అంతేనని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మనలో చాలా మంది పాస్‌వర్డ్‌ల గురించి పట్టించుకోరు. ఏదో ఒక పాస్‌వర్డ్‌ను పెట్టేశాం కదా అని చేతులు దులుపుకుంటారు. కానీ ఇలాంటి బలహీనమైన పాస్‌వర్డ్‌లను పెడితే మొదటికే మోసం వస్తుంది. చాలా మంది ఎక్కడ మర్చిపోతామోనని సులభమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పాస్‌వర్డ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని సలహాలు ఇస్తోంది.

ట్విట్టర్‌ వేదికగా ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. ‘బలమైన పాస్‌వర్డ్‌ మన ఖాతాకు అధిక భద్రత ఇస్తుంది. సైబర్‌ నేరగాళ్ల నుంచి మీ ఖాతాకు రక్షణ కలిగించేలా దృఢమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. ఇందుకోసం ఈ 8 మార్గాలను పాటించండి’ అంటూ ట్వీట్‌ చేసింది. ఇంతకీ ఎస్‌బీఐ సూచించిన ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పాస్‌వర్డ్‌ను క్యాపిటల్‌, స్మాల్‌ లెటర్స్‌ కలిపి ఉండే చూసుకోవాలి. ఉదాహరణకు aBjsE7uG ఇలా ఉండాలి. * అక్షరాలు, అంకెలు, సింబల్స్‌ కలిపి పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే ప్రొటక్షన్‌ ఉంటుంది. ఉదాహరణకు AbjsE7uG61!@ గా ఉండాలి. * మీ పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్‌ ఉండేలా చూసుకోవాలి. * సాధారణంగా డిక్షనరీలో ఉండే పదాలు.. సులువుగా ఉండే పదాలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు. * కీబోర్డులో వరుసగా ఉండే పదాలను కూడా పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. ఉదాహరణకు qwerty, asdfg వంటివి ఉండకూడదు. * 12345678 లేదా abcdefg వంటి పాస్‌వర్డ్‌ జోలికి పోకూడదు. ఇవి తొందరంగా హ్యాక్‌కి గురయ్యే అవకాశం ఉంటుంది. * ఇతరులు సులువుగా ఊహించే విధంగా ఉండే పాస్‌వర్డ్‌లు వాడకూడదు. * వీలైనంత వరకు పాస్‌వర్డ్‌ పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి. మీ పేరు, పుట్టిన తేదీ, మీ కుటుంబసభ్యుల పేర్లు, పుట్టిన ఏడాది వంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు.

Also Read: Couple Relation: కొత్తగా పెళ్లైన జంటలు.. ఈ విషయాల్లో మీ భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే..

World solo flight record: బుజ్జి విమానంలో వరల్డ్ టూర్ షురూ.. 19 యువతి సాహసం..

తూపాకీ తూటాలు, బాంబుల మోతలతో సహజీవనం.. ఆఫ్గనిస్థాన్‌లో సామాన్యుల జీవన విధానం ఇలా..