World solo flight record: బుజ్జి విమానంలో వరల్డ్ టూర్ షురూ.. 19 యువతి సాహసం..

ప్రపంచం చుట్టూ విమానంలో చక్కరు కొట్టాలని ఓ యువతి బయల్దేరింది. పదకొండేళ్ళకు పారాషూట్‌తో జంప్‌ చేసింది. 14 ఏళ్ళకే విమానం నడిపింది. ఒంటరిగా...

World solo flight record: బుజ్జి విమానంలో వరల్డ్ టూర్ షురూ.. 19 యువతి సాహసం..
World Tour Wit Plane
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 19, 2021 | 8:05 PM

ప్రపంచం చుట్టూ విమానంలో చక్కరు కొట్టాలని ఓ యువతి బయల్దేరింది. పదకొండేళ్ళకు పారాషూట్‌తో జంప్‌ చేసింది. 14 ఏళ్ళకే విమానం నడిపింది. ఒంటరిగా ఓ చిన్న ప్లేన్‌లో అడ్వెంచర్‌ మొదలుపెట్టింది. ఆ యువతి పేరు జారా రూథర్‌ఫోర్డ్‌. విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా రికార్డు సాధించడం కోసం 19 ఏళ్ల యువతి సాహస అడ్వెంచర్‌ ప్రారంభించింది. ఒకే సీటున్న విమానంలో ఎగిరింది. ఈదురుగాలులు, మేఘావృతమైన ఆకాశంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా వెరవక, తల్లిదండ్రులు వీడ్కోలు పలుకుతుండగా బుధవారం ప్రయాణాన్ని ప్రారంభించింది. బెల్జియంలోని కొర్ట్రిజ్క్‌లో ఓ చిన్న ఎయిర్‌బేస్‌ నుంచి నింగికి ఎగిరిన ఆమె పేరు జారా రూథర్‌ఫోర్డ్‌.

బెల్జియన్‌-బ్రిటిష్‌ యువతి అయిన జారా రెండు-మూడు నెలల ప్రయాణంలో ఐదు ఖండాలు, 52 దేశాల మీదుగా తన యాత్ర కొనసాగించనుంది. ఇందుకు తన shark sport విమానాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకుంది. జారా ఫ్యామిలీలో అంతా పైలట్లే. ఆరేళ్ళ వయసు నుంచే చిన్న విమానాల్లో ప్రయాణించడం 11 ఏళ్ళకే పారాషూట్‌ నుంచి కిందకి జంప్‌ చేయడం ఆమె జీవితంలో భాగమయ్యాయి. పధ్నాలుగో యేడు నుంచి సొంతంగా విమానం నడుపుతోంది. విమాన పైలట్లుగా మరింత మంది మహిళలు ముందుకు రావాలని ఇందుకు స్ఫూర్తిగా నిలవాలన్నది జారా లక్ష్యం. అతి తక్కువ వయసులో విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా అమెరికాకు చెందిన Shaesta Waiz పేరిట రికార్డు ఉంది. 30 ఏళ్ల వయసులో ఆమె ఆ ఘనత సాధించింది. దాన్ని బద్దలుకొట్టాలని జారా లక్ష్యంగా పెట్టుకుంది.

World Tour

Also Read: ఈ పథకాలతో రైతులకు ఎంతో మేలు.. అస్సలు మిస్ అవ్వకండి… పూర్తి వివరాలు

 ఫీమేల్ స్టూడెంట్స్‌తో కలిసి బస్సులో ప్రయాణించిన ఎస్పీ దీపికా పాటిల్.. అందుకోసం స్వయంగా రంగంలోకి