పొట్టేళ్లు తలపడితే ఎలా ఉంటుందో తెలుసా.. ఫైటింగ్ వీడియో చూడండి

పొట్టేళ్లు తలపడితే ఎలా ఉంటుందో తెలుసా.. ఫైటింగ్ వీడియో చూడండి
Sheep Fight

సాధారణంగా ‘మేకపోతు గాంభీర్యం’ అంటూ సెటైర్లు వేస్తుంటారు. అయితే, ఇక్కడ అదే జాతికి చెందిన రెండు గొర్రెపోతు (పొట్టేళ్లు) తమ

Venkata Narayana

|

Aug 19, 2021 | 7:59 PM

Sheep Fight: సాధారణంగా ‘మేకపోతు గాంభీర్యం’ అంటూ సెటైర్లు వేస్తుంటారు. అయితే, ఇక్కడ అదే జాతికి చెందిన రెండు గొర్రెపోతు (పొట్టేళ్లు) తమ దర్పం చూపించాయి. నువ్వా.. నేనా అనేట్టు ముందు వెనుక చూడక, ఏమాత్రం జంకు బెరుకు లేకుండా పోట్లాడు కున్నాయి. తర తరాలుగా వస్తోన్న తమ జీవన విధానాన్ని కళ్లకు కట్టాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకటి, రెండు నిమిషాలు కాదు.. ఏకంగా 20 నిమిషాల పాటు యుద్దానికి దిగాయి. గొర్రెల కాపరి వాటిని ఆపే ప్రయత్నం చేసినా ఫైటింగ్ ఏమాత్రం ఆపలేదు. ఈ రెండు పొట్టెళ్లు.. తలతో పంచ్‌లు, నడుం దగ్గర పంచ్‌లు ఇచ్చుకుంటూనే ఉన్నాయి.

ఇలా..  రెండు పొట్టేళ్లూ రకరకాల పోరాట విన్యాసాలు చూపించాయి. దూరంగా వెళ్తూ.. మళ్లీ దగ్గరికి వచ్చి తలలు బాదుకుంటూ ఫైటింగ్ చేసుకున్నాయి. ఈ పొట్టెళ్ల ఫైటింగ్ సీన్ చూడటానికి జనం గుమిగూడారు. పాత సినిమాల పొట్టెళ్ల ఫైటింగ్‌ను గుర్తు చేసుకున్నారు. ఇక, కింద పడినా మళ్లీ పైకి లేచి.. దూమ్.. దామ్ గా ఫైటింగ్ చేస్తూ తమ దమ్మెంతో చూపించాయి ఆ మూగజీవాలు. ఫైటింగ్ చేసి.. చేసి అలిసిపోయిన తర్వాత… మళ్లీ మేతకు వెళ్లాయి.

Read also: Vizag Stell: నీతి ఆయోగ్‌ సీఈవోకు ఉక్కుసెగ.. దద్దరిల్లిన విశాఖలోని స్మృత్యాంజలి జంక్షన్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu