AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Stell: నీతి ఆయోగ్‌ సీఈవోకు ఉక్కుసెగ.. దద్దరిల్లిన విశాఖలోని స్మృత్యాంజలి జంక్షన్

ఉక్కు కార్మిక లోకం మరోసారి భగ్గుమంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. తాజాగా నీతి ఆయోగ్‌

Vizag Stell: నీతి ఆయోగ్‌ సీఈవోకు ఉక్కుసెగ.. దద్దరిల్లిన విశాఖలోని స్మృత్యాంజలి జంక్షన్
Vizag Steel
Venkata Narayana
|

Updated on: Aug 19, 2021 | 7:21 PM

Share

Niti Aayog CEO Amitabh Kant: ఉక్కు కార్మిక లోకం మరోసారి భగ్గుమంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. తాజాగా నీతి ఆయోగ్‌ సీఈవోకు ఉక్కుసెగ తగిలింది.. సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌.. గోబ్యాక్‌ నీతి ఆయోగ్‌ సీఈవో నినాదాలతో విశాఖ దద్దరిల్లింది. కాగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. విశాఖలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పర్యటనను నిరసిస్తూ కార్మికులు ఇవాళ సాగర నగరంలో నిరసనకు దిగారు.

విశాఖపట్నం స్మృత్యాంజలి జంక్షన్ దగ్గర కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో ఉక్కు కార్మికులు హోరెత్తించారు. నీతి ఆయోగ్ సీఈఓ బ్రాండిక్స్‌, మెడ్‌టెక్‌ జోన్లలో పర్యటనను గుట్టుగా ఉంచినప్పటికీ కార్మికులు ఆయన బసచేసిన హిల్‌ టాప్ గెస్ట్‌ హౌజ్‌ ఎదుట ధర్నా చేపట్టారు. సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌.. గోబ్యాక్‌ నీతి ఆయోగ్‌ సీఈవో అంటూ కార్మిక సంఘాల నేతలు నినాదాలు చేశారు. నీతి ఆయోగ్‌లోని అధికారులు నీతి లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.ఈ ఆందోళనలతో జనరల్‌ షిప్ట్‌కు వెళ్లాల్సిన కార్మికులు నిలిచిపోయారు.

మరోవైపు, స్టీల్‌ ప్లాంట్‌ల నుంచి వ్యూహాత్మక పెట్టుబడులు ఉపసంహరణ చేయాలని నీతి ఆయోగ్‌ సూచించింది. దీంతో వాళ్ల ఎదుటే తమ నిరసన వ్యక్తం చేయాలని కార్మికులు గట్టిగా నిర్ణయించుకున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. కార్మికులు నెలల తరబడి ఆందోళనలు చేబడుతున్నా ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కితగ్గడం లేదు. వంద శాతం అమ్మేందుకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడంతో కార్మికలోకం భగ్గుమంటోంది. కేంద్రం ఇప్పటికైనా పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Vizag

Vizag

Read also: గాలి గమనంతో పోటీ పడుతూ.. నీటి అలలపై ఆట..! హుస్సేన్ సాగర్ వేదికగా.. 35వ సెయిలింగ్ వీక్ ఎండ్స్ టుడే