గాలి గమనంతో పోటీ పడుతూ.. నీటి అలలపై ఆట..! హుస్సేన్ సాగర్ వేదికగా.. 35వ సెయిలింగ్ వీక్ ఎండ్స్ టుడే

గాలి గమనంతో పోటీ పడుతూ.. నీటి అలలపై ఆడే ఆట సెయిలింగ్. హుస్సేన్ సాగర్ వేదికగా.. 35వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ జరుగుతోంది.

గాలి గమనంతో పోటీ పడుతూ.. నీటి అలలపై ఆట..! హుస్సేన్ సాగర్ వేదికగా.. 35వ సెయిలింగ్ వీక్ ఎండ్స్ టుడే
Hyderabad Sailing Week
Follow us

|

Updated on: Aug 19, 2021 | 6:55 PM

Hyderabad Sailing Week: గాలి గమనంతో పోటీ పడుతూ.. నీటి అలలపై ఆడే ఆట సెయిలింగ్. హుస్సేన్ సాగర్ వేదికగా.. 35వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ జరుగుతోంది. ఈ పోటీలు పర్యాటకులను నగరవాసులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. హుస్సేన్ సాగర్ లో జరిగే సైలింగ్ పోటీలంటే సిటిజనులకు.. ఎంతో క్రేజ్. సీతాకోక చిలుకల్లా హుస్సేన్ సాగర్ లో చక్కర్లు కొడుతున్న సెయిలింగ్ బోట్లను చూసి తన రోజువారీ శ్రమల్ని మర్చిపోయి ఉత్సాహంగా ఫీలవుతుంటారు నగర వాసులు.

సాధారణంగా.. సముద్ర తీరాల్లో.. నదీ తీరాల్లో.. పెద్ద పెద్ద సరస్సుల్లో ఇలాంటి పోటీలు సాగుతుంటాయ్. నాటి బ్రిటీషర్ల చొరవ కారణంగా భాగ్యనగరాన్ని కూడా వెతుక్కుంటూ.. వచ్చింది సైలింగ్. ప్రస్తుతం జరుగుతున్న ఈ పోటీలకు దేశంలోని 12 సెయిలింగ్ క్లబ్బుల నుంచి వంద మంది సెయిలర్లు పాల్గొంటున్నారు.

లేజర్, లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియర్, లేజర్ 4.7 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు నిర్వాహకులు. నిర్ణీత సమయంలో గాలి గమనాన్ని వాడుకుంటూ.. ఆటను పూర్తి చేసిన వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. ఈ పోటీల్లో మెన్స్- విమెన్స్- చిల్డ్రెన్- విభాగాలున్నాయి. కాగా, వారంపాటు సాగిన ఈ 35 వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకలు ఈ సాయంత్రం జరుగుతున్నాయి.

ఇప్పుడిప్పుడే.. సెయిలింగ్ శిక్షణ కేంద్రాల సంఖ్య పెరగటంతో పాటు.. ప్రభుత్వ సహకారంతో గురుకుల, స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్స్, ఈ క్రీడల్లో బాగా రాణిస్తున్నారు. ఈ ఆట ఆడాలంటే ఫిట్నెస్ చాలా చాలా ముఖ్యం. గత పదేళ్ల నుంచీ సెయిలింగ్ కి యువతలో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది.

సెయిలింగ్ ఒలింపిక్స్ స్పోర్ట్. కాబట్టి యువత దీన్ని కెరీర్ గా ఎంచుకుంటే ఎంతో మంచి భవిష్యత్ ఉంటుంది.. ఒకప్పుడు సంపన్న వర్గాల్లో, త్రివిధ దళాల్లో పని చేసేవారు మాత్రమే.. సెయిలింగ్ పై ఇంట్రస్ట్ చూపించేవారనీ. ఇప్పుడు సామాన్యులు సైతం.. మక్కువ చూపుతున్నారనీ అంటున్నారు నిర్వాహకులు.

దేశంలోని సరస్సులన్నిటి కంటే.. అత్యంత అనువైన వాతావరణం హుస్సేన్ సాగర్ లేక్ సొంతం. గాల్లో ఎలాంటి పెనుమార్పులు లేకుండా ఉండటం.. సాగర్ స్పెషాలిటీ. దీంతో సెయిలర్లంతా ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక్కడ వాతావరణం కారణంగా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా బాగా తక్కువ.

ప్రతి ఏడాది.. టాప్ రేటెడ్ సెయిలర్ల క్యాంప్ సైతం ఇక్కడే జరుగుతుంది. ఇక పోటీలకు హుస్సేన్ సాగర్ దాదాపు 30 ఏళ్లకు పైగా అతిథ్యమిస్తోంది. హుస్సేన్ సాగర్ లో శిక్షణ పొందిన ఎందరో సెయిలర్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన దాఖలాలున్నాయి. దటీజ్ హుస్సేన్ సాగర్ సైలింగ్ కెపాసిటీ!

ఎలెందర్, టీవీ9 తెలుగు, హైదరాబాద్

Read also: Tourism Capital: జమ్ము-కశ్మీర్‌ ‘టెర్రరిజం’ కేపిటల్ కాదు – ‘టూరిజం’ కేపిటల్

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..