AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Booster dose: కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోస్‌ కచ్చితంగా అవసరమే అంటోన్న సీరం ఇనిస్టిట్యూట్..! ఎందుకంటే..

కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోస్‌ అవసరమా? ఇప్పటికే తీసుకున్న రెండు డోసులు చాలవా? ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Booster dose: కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోస్‌ కచ్చితంగా అవసరమే అంటోన్న సీరం ఇనిస్టిట్యూట్..! ఎందుకంటే..
Corona Affect On Brain
Venkata Narayana
|

Updated on: Aug 19, 2021 | 8:56 PM

Share

Booster dose: కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోస్‌ అవసరమా? ఇప్పటికే తీసుకున్న రెండు డోసులు చాలవా? ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బూస్టర్ల కోసం అనవసరమైన హడావుడి వద్దని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుంటే.. సీరం ఇనిస్టిట్యూట్ మాత్రం ఈ అంశంలో కచ్చితమైన స్టాండ్ తీసుకుంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనా ఇంకా దేశంలో సగం మందికి కూడా అందలేదు. ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నవారికి సెకండ్‌ డోస్‌ దొరకడం ఒక సమస్య అయితే.. అసలు మొదటి డోసే వేయించుకోనివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

అయితే, ఇప్పుడు బూస్టర్‌ డోస్‌ తెర మీదకు వచ్చింది. కొన్ని దేశాలు రెండు డోసులు తీసుకున్నవారు మూడో డోస్‌ కూడా తీసుకోవాలని సిఫార్స్‌ చేస్తున్నాయి. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌తో పాటు బలహీన రోగ నిరోధకశక్తిని దృష్టిలో పెట్టుకొని బూస్టర్‌గా మూడో డోస్‌ తీపుకోవాలని సిఫార్స్‌ చేస్తున్నాయి. కొత్తగా డెల్టాతో పాటు పలు వేరియంట్లు విజృంభిస్తుండటంతో బూస్టర్‌ డోస్‌ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి కొన్ని దేశాల ప్రభుత్వాలు. అమెరికాతో పాటు బ్రిటన్‌కు చెందిన వైద్య ఆరోగ్య శాఖలు ఇప్పటికే మూడో డోస్‌కు ఆమోదం తెలిపాయి. డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే 10 లక్షల మందికి బూస్టర్ డోసు ఇచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ఇక బూస్టర్‌ డోస్‌ అంత అవసరసమా అనే చర్చకూడా మొదలైంది. డెల్టా వేయింట్‌పై ఇప్పటికే తీసుకున్న రెండు డోసులు భేషుగ్గా పని చేస్తున్నాయని, బూస్టర్‌ డోసుల పేరుతో హడావుడి వద్దని అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గగన్‌దీప్ కాంగ్‌. బూస్టర్‌ డోసు కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తుంది అనే గ్యారంటీ ఏమీ లేకున్నా వ్యాధి తీవ్రతను తగ్గించడంలో మాత్రం సహకరిస్తుందని ఆమె అన్నారు.

మరోవైపు మన దేశంలో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తమ 8 వేల మంది ఉద్యోగులకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చేసింది. మూడో డోస్‌ అవసరమేనని అంటున్నారు ఆ సంస్థ ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా . భారత్‌లో కూడా దీన్ని త్వరలో సిఫార్స్‌ చేస్తారని చెబుతున్నారు. కాగా బూస్టర్‌ డోస్‌ ప్రతిపాదనను ఇప్పటికే వ్యతిరేకించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంకా ఎన్నో పేద దేశాలకు వ్యాక్సిన్‌ అందని పరిస్థితుల్లో ప్రస్తుతానికి బూస్టర్‌ డోస్‌పై నిషేధం విధించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తున్నా అగ్ర దేశాలు పట్టించుకోవడం లేదు.

Read also: