AP: క‌రోనా వల్ల త‌ల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులందరికీ ఉచిత విద్య.. ఏపీ సర్కారు సత్వర చర్యలు

క‌రోనా కార‌ణంగా త‌ల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధుల చ‌దువులు ఆగ‌కుండా ఉండేలా ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

AP: క‌రోనా వల్ల త‌ల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులందరికీ ఉచిత విద్య.. ఏపీ సర్కారు సత్వర చర్యలు
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 19, 2021 | 9:33 PM

Covid Victims: క‌రోనా కార‌ణంగా త‌ల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధుల చ‌దువులు ఆగ‌కుండా ఉండేలా ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ‌తంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో విద్యా శాఖ ఈ మేరకు అదేశాలిచ్చింది. తల్లితండ్రులు ఇద్దరూ, లేదా ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల వివరాలను సేకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వారి బాగోగులకు సంబంధించిన అంశాలపై నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయా మండల, డివిజనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ విద్యాశాఖ‌.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 19 లక్షల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అదే స‌మ‌యంలో క‌రోనా భారిన ప‌డి దాదాపు 13 వేల 7వంద‌ల మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు. ఇలా క‌రోనా బారిన‌పడి మ‌రణించిన పిల్లల చ‌దువుల‌పై సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. అలాంటి విద్యార్దులను గుర్తించ‌డంతో పాటు వారికి చ‌దువుల‌కు ఆట‌కం క‌ల‌గ‌కుండా చ‌ర్యలు తీసుకోవాల‌న్న సుప్రీం అదేశాల మేర‌కు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చ‌ర్యలు చేప‌ట్టింది.

ఇక ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక తరహాలోనే యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్ లు ఇవ్వాలని ఆయా సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని కోసం అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. తల్లితండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన పిల్లల విషయంలో ఎలాంటి సమస్యనైనా మండల, డివిజనల్ విద్యాశాఖ అధికారులకు నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు.

Read also: Ramya Murder: రమ్య హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా వినూత్న చర్చలు : మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌