Ramya Murder: రమ్య హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా వినూత్న చర్చలు : మహిళా కమిషన్ చైర్‌పర్సన్
గుంటూరు యువతి రమ్య హత్య వ్యవహారాన్ని టీడీపీ నేత నారా లోకేష్ రాజకీయం చేస్తున్నారని ఏపీ మహిళా కమిషన్
Vasireddy Padma: గుంటూరు యువతి రమ్య హత్య వ్యవహారాన్ని టీడీపీ నేత నారా లోకేష్ రాజకీయం చేస్తున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితుడిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారని ఆమె గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రయత్నించడం సిగ్గు చేటని ఆమె అన్నారు.
మహిళల రక్షణకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకువచ్చారన్నారని చెప్పిన వాసిరెడ్డి.. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే టీడీపీ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని నిలదీశారు. టీడీపీ నేత నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.
రమ్య ఉదంతం లాంటి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూళ్లు, కాలేజీల్లో త్వరలోనే అవగాహన సదస్సులు ప్రారంభిస్తామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. మహిళలకు సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని.. ఎక్కడా తక్కువ చేసి చూడడంలేదన్నారామె.
Read also: Booster dose: కొవిడ్ టీకా బూస్టర్ డోస్ కచ్చితంగా అవసరమే అంటోన్న సీరం ఇనిస్టిట్యూట్..! ఎందుకంటే..