Guntur District: ఊహించని విషాదం.. వెంటాడిన తేనెటీగలు.. గుండెపోటుతో వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెత్తుతూ...

Guntur District: ఊహించని విషాదం.. వెంటాడిన తేనెటీగలు.. గుండెపోటుతో వ్యక్తి మృతి
Honey Bees Attack
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 19, 2021 | 9:27 PM

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెత్తుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మాచర్ల పట్టణంలో టైలరింగ్ వృత్తి చేసే మద్దోజు శ్రీనివాసాచారి(55) బంధువుల సంవత్సరికం ఉండటంతో ఉప్పలపాడు గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. గ్రామ శివారులో పూజలో భాగంగా హోమం చేస్తుండగా పొగ దట్టంగా వ్యాపించింది. దీంతో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న చెట్టుపై గల తేనెతుట్టె పొగ వల్ల చెల్లా చెదురైంది. ఈ క్రమంలో తేనెటీగలు ఒక్కసారిగా అక్కడున్న వారిపై దాడి చేశాయి. అదే సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాసాచారిపై కూడా దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుతూ కింద పడి పోయాడు. స్పృహ కోల్పోయిన ఆయనను హుటాహుటిన మాచర్లకు తరలించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఆరోపణలు అవాస్తవం: పోలీసులు

పోలీసులను నాలుగు రోజులుగా టెన్షన్ పెట్టించిన గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో కొత్త విషయం బయటపడింది. మహబూబ్‌నగర్‌ నుంచి ఈ నెల 5న కిడ్నీ వ్యాధిని నయం చేసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగి భార్య, మరదలిపై అత్యాచారం, ఆ తర్వాత ఒకరు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. కానీ, చివరికి అత్యాచార ఘటన అంతా కల్పితమే అని పోలీసులు తేల్చారు. గాంధీ ఆసుపత్రిలో మహిళపై రేప్ జరిగిన ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. భ్రమలకులోనై టెక్నీషియన్ అత్యాచారం చేసినట్లు ఆరోపించారని పేర్కొన్నారు. సీసీ కెమెరా విజువల్స్, డాక్టర్స్ రిపోర్ట్, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మత్తుప్రయోగం, అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: Afghanistan crisis: ఆ విమానంలో నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు!

 బుజ్జి విమానంలో వరల్డ్ టూర్ షురూ.. 19 యువతి సాహసం..