Vijayasai Reddy: ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు వెల్లువలా పెరిగాయి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాల

Vijayasai Reddy: ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు వెల్లువలా పెరిగాయి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Vijaya Sai Reddy
Follow us

|

Updated on: Aug 19, 2021 | 9:48 PM

AP Government School Admitions: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు వెల్లువలా పెరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. పలు స్కూళ్లలో ‘నో వేకెన్సీ’ బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఈ రెండేళ్లలో 6.23 లక్షల మంది అదనంగా చేరారని సాయి చెప్పుకొచ్చారు.

పనిలో పనిగా టీడీపీ నేత నారా లోకేష్ తీరుపై నిప్పులు చెరిగారు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ. “పబ్లిసిటీ జిమ్మిక్కుల మీద ఇంకా ఎన్నాళ్లు బతకుతావు లోకేశం? ఇంట్లో చేతులు నలుపుకుంటూ కూర్చున్నా రోజంతా మీ ఎల్లో టీవీలు లైవ్ పెట్టి చూపిస్తాయి. ఇంత దూరం వచ్చి ఏం సాధించినట్టు. ప్రజలను గుండెళ్లో పెట్టుకుని చూసేవాళ్లకే ఆదరణ ఉంటుంది. నువ్వో వెలిసిపోయిన జెండావి. సంస్కార హీనుడివి” అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్టర్ వేదిగా విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జగన్ గారి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని విజయసాయి చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ 15 నాటికి రాష్ట్రంలో ఆస్పత్రుల్లో 6 వేల బెడ్లు, 140 ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆక్సిజన్‌ ప్లాంట్ల కోసం ప్రభుత్వం రూ. 300 కోట్లు ఖర్చు పెడుతోందని అంత‌కు ముందు విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్లో వెల్లడించారు.

Read also: Booster dose: కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోస్‌ కచ్చితంగా అవసరమే అంటోన్న సీరం ఇనిస్టిట్యూట్..! ఎందుకంటే..

Latest Articles