Viral News: ఫోన్ చూసుకుంటూ భర్త ముసి ముసి నవ్వులు.. డౌటొచ్చి భార్య కూపీలాగితే బయటపడ్డ బండారం
Social Media: ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!
Updated on: Aug 19, 2021 | 8:42 PM

వివాహం అనేది గొప్ప బంధంగా అభివర్ణిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రబుద్దులు వివాహ బంధానికి మచ్చ తెచ్చే విధంగా పనులు.. ఈ మధ్య కాలంలో కొంతమంది వివాహ బంధానికి మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. అలాంటి ఓ ఘటన గురించే ఇప్పుడు చెప్పేది.

లండన్‌కు చెందిన మరియా గిల్లెన్ గార్సియా, టామ్ మెక్‌కేబ్‌లు భార్యాభర్తలు. వీరిద్దరి వివాహం 2009లో జరిగింది. వీరి మధ్య కొద్దిరోజుల పాటు అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత టామ్ మెక్‌కేబ్ వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. తరచూ ఫోన్‌లో మునిగిపోవడం.. పక్కన ఉన్నవాళ్ల గురించి పట్టించుకోకపోవడం.. ఫోన్‌ను చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వడం చేసేవాడు.

ఇక భర్తలో వచ్చిన ఈ మార్పును గమనించిన మరియా.. తనకు తెలియకుండా భర్త ఏదో విషయాన్ని దాస్తున్నాడని అనుమానించింది. అదే క్రమంలో భర్తపై నిఘా పెట్టింది. అతడు లేని సమయంలో మొబైల్ ఫోన్‌ను పరిశీలించింది. వేరొకరి కుటుంబానికి చెందిన ఫోటోలు దర్శనమిచ్చాయి.

దీనితో భర్త టామ్ మెక్‌కేబ్ సోషల్ మీడియా అకౌంట్‌ను పరిశీలించగా.. అతడు వేరొక మహిళకు పంపిన లవ్ సింబల్స్, మెసేజ్‌లు చూసింది. వాటిని చదవడంతో తాను అతడికి రెండో భార్యనని మరియాకు స్పష్టమైంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది.

దీంతో ఆమె టామ్ చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు తమదైన శైలిలో అడగగా.. టామ్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో 15 సంవత్సరాలు పాటు రెండు కుటుంబాలను కొనసాగిస్తూ వచ్చానని నిజం ఒప్పుకున్నాడు.