TS Inter Marks Memo 2024: వెబ్‌సైట్లో ఇంటర్ మార్క్స్ మెమోలు.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం 11 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన మార్కుల మెమోలను మాత్రం ఇంటర్ బోర్డు ఆలస్యంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం సాయంత్రం నుంచి విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తన వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను వెబ్సైట్లో..
హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం 11 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన మార్కుల మెమోలను మాత్రం ఇంటర్ బోర్డు ఆలస్యంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం సాయంత్రం నుంచి విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తన వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను వెబ్‌సైట్‌లో నమోదు చేసి, మార్కుల షార్ట్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు ప్రకటించిన పది రోజుల వరకు మాత్రమే వెబ్‌సైట్ నుంచి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తాజా ఫలితాల్లో 69.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 2.87 లక్షల మంది, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2024 మార్కుల మెమో డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల 2024 షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహించే ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు డీఈవో దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే3 న ప్రారంభమై మే 10 వరకు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
22024-25 విద్యాసంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ (రెప్యూటేడ్) జూనియర్ కాలేజీల పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగ విద్యార్థులకు ఇంటర్‌లో ప్రవేశాల కోసం కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా ఉపసంచాలకులు నతానియెల్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు ఏప్రిల్ 27వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు. ఎంపికైన విద్యార్ధులకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు కింద రూ.35 వేలు, ప్యాకెట్ మనీకి రూ.3 వేలు మంజూరవుతాయని ఆయన వివరించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.