JEE Mains 2024 Toppers List: జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా 22 మందికి వంద పర్సంటైల్‌

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-2 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి స్కోర్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దాదాపు 12.57 లక్షల మంది అభ్యర్ధులకు 319 నగరాల్లో ఏప్రిల్ 4 నుంచి 12 వరకు ఈ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులే 22 మంది దాకా ఉన్నారు..

JEE Mains 2024 Toppers List: జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా 22 మందికి వంద పర్సంటైల్‌
JEE Mains 2024 Toppers List
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 25, 2024 | 8:40 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-2 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి స్కోర్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దాదాపు 12.57 లక్షల మంది అభ్యర్ధులకు 319 నగరాల్లో ఏప్రిల్ 4 నుంచి 12 వరకు ఈ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులే 22 మంది దాకా ఉన్నారు. తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు వంద పర్సెంటైల్‌ సాధించారు. గతేడాది 43 మంది అభ్యర్ధులు వంద పర్సెంటైల్‌ సాధించారు. ఏప్రిల్‌ 22న జేఈఈ మెయిన్ తుది ఆన్సర్‌ కీ విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA), ప్రకటన తేదీ కంటే ఒక రోజు ముందుగానే రిజల్ట్స్‌ను విడుదల చేసింది.

జేఈఈ మెయిన్‌ 2024 వంద పర్సంటైల్‌ సాధించిన తెలంగాణ విద్యార్థులు వీరే..

హందేకర్‌ విదిత్‌, ముత్తవరపు అనూప్‌, వెంకట సాయి తేజ మదినేని, రెడ్డి అనిల్‌, రోహన్‌ సాయి బాబా, శ్రీయాశస్‌ మోహన్‌ కల్లూరి, కేసం చన్న బసవ రెడ్డి, మురికినాటి సాయి దివ్య తేజ రెడ్డి, రిషి శేఖర్‌ శుక్లా, తవ్వ దినేశ్‌ రెడ్డి, గంగ శ్రేయాస్‌, పొలిశెట్టి రితిష్‌ బాలాజీ, తమటం జయదేవ్‌ రెడ్డి, మావూరు జస్విత్‌, దొరిసాల శ్రీనివాస రెడ్డి

జేఈఈ మెయిన్‌ 2024లో వంద పర్సంటైల్‌ సాధించిన ఏపీ విద్యార్థులు వీరే..

చింటు సతీష్‌ కుమార్‌, షేక్‌ సురజ్‌, మకినేని జిష్ణు సాయి, తోటంశెట్టి నిఖిలేష్‌, అన్నరెడ్డి వెంకట తనిష్‌ రెడ్డి, తోట సాయి కార్తీక్‌, మురసాని సాయి యశ్వంత్‌ రెడ్డి

ఇవి కూడా చదవండి

2,50,284 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక.. ఏప్రిల్ 27 నుంచి దరఖాస్తులు

కాగా జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులను కూడా ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో ఈ ఏడాది మొత్తం 2,50,284 అభ్యర్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత సాధించినట్లు వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారన్న సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఏప్రిల్‌ 27 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అర్హత సాధించిన వారంతా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్‌ కార్డులు మే 17 నుంచి 26 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 26వ తేదీన రెండు సెషన్లలో ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం సెషన్‌లో పేపర్‌ 1 పరీక్ష 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్‌ 2 పరీక్ష 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు జూన్‌ 9న విడుదల అవుతాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.